Breaking: ‘హనుమాన్ జంక్షన్‌’ నటి విజయలక్ష్మి‌ ఆత్మహత్యాయత్నం

ప్రముఖ నటి విజయ లక్ష్మి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో కొందరు తనను వేధిస్తున్నారని ఆవేదన చెందిన విజయ లక్ష్మి ఆదివారం బీపీ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Breaking: హనుమాన్ జంక్షన్‌ నటి విజయలక్ష్మి‌ ఆత్మహత్యాయత్నం

Edited By:

Updated on: Jul 27, 2020 | 11:40 AM

Vijayalakshmi suicide attempt: ప్రముఖ నటి విజయ లక్ష్మి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో కొందరు తనను వేధిస్తున్నారని ఆవేదన చెందిన విజయ లక్ష్మి ఆదివారం బీపీ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.

అయితే ఆత్మహత్య చేసుకునే ముందు విజయలక్ష్మి ఓ వీడియోను విడుదల చేశారు. అందులో.. ”ఇది నా చివరి వీడియో. నామ్‌ తమిళర్‌ పార్టీ నేత సీమన్, అతడి అనుచరుల వలన గత నాలుగు నెలలుగా నేను ఎంతో ఒత్తిడిని అనుభవిస్తున్నా. నా ఫ్యామిలీ కోసం బతికి ఉండేందుకు చాలా ప్రయత్నించాను. మీడియాలో హరినందన్ నన్ను తప్పుగా చూపేందుకు ప్రయత్నించాడు. నేను బీపీ మాత్రలను తీసుకున్నా. ఏదో ఒక సమయంలో నా బీపీ తగ్గిపోయి.. నేను చచ్చిపోతా” అని చెప్పుకొచ్చారు. కాగా 2006లో ఓ దర్శకుడు తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ విజయ లక్ష్మి ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. అప్పుడు బ్రతికిన ఈ నటి.. తాజాగా మరోసారి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఇదిలా ఉంటే ఈ నటి తెలుగులో హనుమాన్ జంక్షన్‌, పృధ్వీ నారాయణ చిత్రాల్లో నటించారు.

Read This Story Also: త్వరలోనే PUBG బ్యాన్‌..!