త‌వ్వే కొద్దీ క‌దులుతోన్న డొంక..రాయ‌పాటిని బెదిరించిన కేసులో ఆ హీరోయిన్ ప్ర‌ధాన హ‌స్తం..

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బ్యాంకులకు రుణాలు ఎగ‌వేత కేసును సీబీఐ విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కేసును ఆసరాగా చేసుకుని ఆయనకు వార్నింగ్స్ ఇచ్చి డ‌బ్బు దోచుకోవాల‌ని చూసిన వ్య‌వ‌హారంలో చిక్కుముడి వీడుతోంది.

త‌వ్వే కొద్దీ క‌దులుతోన్న డొంక..రాయ‌పాటిని బెదిరించిన కేసులో ఆ హీరోయిన్ ప్ర‌ధాన హ‌స్తం..
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Jun 15, 2020 | 1:19 PM

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బ్యాంకులకు రుణాలు ఎగ‌వేత కేసును సీబీఐ విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కేసును ఆసరాగా చేసుకుని ఆయనకు వార్నింగ్స్ ఇచ్చి డ‌బ్బు దోచుకోవాల‌ని చూసిన వ్య‌వ‌హారంలో చిక్కుముడి వీడుతోంది. ఈ కేసులో సీబీఐ అధికారులు.. మ‌ల‌యాళ న‌టి మరియాపాల్, ఆమె ప్రియుడు సుఖేశ్ చంద్రశేఖర్ ల‌ను అస‌లు సూత్ర‌ధారులుగా గుర్తించారు. వీరి అరెస్టుకు రంగం సిద్ద‌మైంది. ఇప్ప‌టికే లీనాపై లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిన సీబీఐ అధికారులు…ఆమె కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. లీనా అనుచరులు మణి వర్ధన్,సెల్వ రామరాజ్, అర్చిత్ లను ఇప్పటికే అరెస్ట్ చేశారు.

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై రుణాల ఎగ‌వేత సంబంధించి సీబీఐ గతేడాది కేసు నమోదు చేసింది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు చేజిక్కించుకున్న‌ రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్ద పేరుతో బ్యాంకుల నుంచి స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యుల పేర్లు మీద‌ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఆయ‌న్న బెదిరించి డ‌బ్బులు గుంజేందుకు ఈ ముఠా రంగంలోకి దిగింది. ప‌లుసార్లు సీబీఐ అధికారులంటూ డీల్ కోసం ఫోన్లు చెయ్య‌డ‌మే కాకుండా..ఈ ఏడాది జనవరిలో రాయపాటి ఇంటికి మరియాపాల్ అనుచరుల్లో ఒకడైన మణివర్దన్ రెడ్డి వ‌చ్చి డ‌బ్బు డిమాండ్ చేశాడు. అడిగినంత ఇస్తే ఈ కేసు నుంచి తప్పిస్తామన్నారు. వీరిపై అనుమానమొచ్చిన రాయపాటి సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో అల‌ర్ట‌యిన‌ సీబీఐ అధికారులు మణివర్ధన్ రెడ్డితో పాటు మరో నిందితుడు రామరాజ్ ను హైదరాబాద్, చెన్నైలో అరెస్టు చేశారు. వీరిని విచారించగా.. ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వ‌చ్చింది.

మరియాపాల్ ముఠా చేసిన నేరాల‌పై దర్యాప్తు చేసిన సీబీఐకి ఊహించ‌ని డిటేల్స్ ల‌భించాయి. మరియాపాల్ ముఠా దేశంలో ఎక్కడ ఎవరిపైన సీబీఐ కేసు నమోదైనా వారిపై ఈ త‌ర‌హా బెదిరింపులకు పాల్పడి..గుట్టు చ‌ప్పుడు కాకుండా చెక్కేసేవార‌ని తేలింది. లీనాపై గతంలోనూ అనేక కేసులు న‌మోద‌య్యాయి. ‘అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం’ పార్టీ నేత టీటీవీ దిన కరన్ ని గతంలో ఆమె బెదిరించిన‌ట్టు ఆధారులున్నాయి. మ‌రోవైపు కేరళలో బ్యూటీ పార్లర్ల పేరుతో 19కోట్ల మేర బ్యాంకులని మోసం చేసిన కేసులో గతంలో లీనా అరైస్టైంది. ఈ కిలాడీ న‌టి ‘మద్రాస్ కేఫ్’, ‘రెడ్ చిల్లీస్’ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu