బ్రేకింగ్ : గుంటూరు జిల్లాలో భారీ పేలుడు

గుంటూరు జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. తాడేపల్లిలోని కృష్ణానగర్లో ఓ ఇంట్లో బాంబు పేలింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న పింకీ అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇళ్లు మొత్తం ధ్వంసమయ్యింది. అయితే ఇంట్లో బాణాసంచకి సంబంధించిన ఉల్లిపాయ బాంబులు తయారీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. 100 ఉల్లిపాయ బాంబులు చుట్టితే.. రూ. 40 వస్తాయన్న ఆశతో.. ప్రమాదకరమైన ఈ బాంబులను చుడుతున్నారని.. ఆ సమయంలో ఒక్కసారిగా […]

బ్రేకింగ్ : గుంటూరు జిల్లాలో భారీ పేలుడు
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 5:22 PM

గుంటూరు జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. తాడేపల్లిలోని కృష్ణానగర్లో ఓ ఇంట్లో బాంబు పేలింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న పింకీ అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇళ్లు మొత్తం ధ్వంసమయ్యింది. అయితే ఇంట్లో బాణాసంచకి సంబంధించిన ఉల్లిపాయ బాంబులు తయారీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. 100 ఉల్లిపాయ బాంబులు చుట్టితే.. రూ. 40 వస్తాయన్న ఆశతో.. ప్రమాదకరమైన ఈ బాంబులను చుడుతున్నారని.. ఆ సమయంలో ఒక్కసారిగా దాదాపు 100 బాంబులు ఒకేసారి పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.