క్యూట్ బేబీ కటింగ్‌తో వైరల్ అవుతోన్న ఏనుగు..

క్యూట్ బేబీ హెయిర్‌ కటింగ్‌తో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఓ ఏనుగు. దీని పేరు 'బాబ్ కట్ సెంగమలం'. సాధారణంగా ఏనుగులంటే అందరికీ భయమే.. కానీ ఈ ఏనుగును చూస్తే మాత్రం సో క్యూట్ అనాల్సిందే. ఈ ఏనుగు తమిళనాడుకు...

క్యూట్ బేబీ కటింగ్‌తో వైరల్ అవుతోన్న ఏనుగు..
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2020 | 5:21 PM

క్యూట్ బేబీ హెయిర్‌ కటింగ్‌తో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఓ ఏనుగు. దీని పేరు ‘బాబ్ కట్ సెంగమలం’. సాధారణంగా ఏనుగులంటే అందరికీ భయమే.. కానీ ఈ ఏనుగును చూస్తే మాత్రం సో క్యూట్ అనాల్సిందే. ఈ ఏనుగు తమిళనాడుకు చెందినది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏనుగులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. వాటిని కూడా ఉద్యోగులుగా చూస్తూంటారు. వాటితో ప్రత్యేకంగా ఆలయాలకు సేవలు చేయిస్తూంటారు. చాలా మంది లాగే ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి సుధా రామోన్‌కి ఈ ఏనుగు బాగా నచ్చింది దీంతో ఫొటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ సమయంలో దాని జుట్టును దువ్వుతూ కనిపించాడు మావటి. అందమైన బేబీ హెయిర్ కటింగ్‌తో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది ఈ సెంగమలం. మరో ఫొటోలో ఇది నడుస్తూ కనిపించింది. ఇప్పటికే ఈ ట్వీట్ 16 వేలకు పైగా లైక్స్ పొందింది.