బీజేపీకి అంత సీన్ లేదా… ఇదేం గెస్ రాంమాధవ్ జీ.!

ఈసారి కూడా కేంద్రంలో తమ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాత్రం డౌటే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీజేపీకి ఈసారి పూర్తి మెజారిటీ రావడం కష్టమేనని ఆయన అన్నారు. ఒకవేళ అదే జరిగినా ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. లోక్ సభలోని మొత్తం 543 సీట్లకు గాను 271 సీట్లు […]

బీజేపీకి అంత సీన్ లేదా... ఇదేం గెస్ రాంమాధవ్ జీ.!
Follow us

|

Updated on: May 07, 2019 | 12:07 PM

ఈసారి కూడా కేంద్రంలో తమ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాత్రం డౌటే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీజేపీకి ఈసారి పూర్తి మెజారిటీ రావడం కష్టమేనని ఆయన అన్నారు. ఒకవేళ అదే జరిగినా ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

లోక్ సభలోని మొత్తం 543 సీట్లకు గాను 271 సీట్లు గెలుచుకుంటే ఆ మజానే వేరన్న రాంమాధవ్.. ఒకవేళ ఆ మేరకు సీట్లలో విజయం సాధించకపోతే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. రాంమాధవ్ మాటలు ఇలా ఉంటే.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాత్రం అధికారం తమదేనని గడిచిన ఐదేళ్లలో ప్రజలు ట్రైలర్ మాత్రమే చూశారని.. ఈసారి గెలిచి అధికారంలోకి వచ్చాక పూర్తి సినిమా చూపిస్తామని అంటున్నారు. ఒక పక్క ఈయన సినిమా చూపిస్తా అంటుంటే.. మరోపక్క ఆయన అంత సీన్ లేదంటున్నారు. ఇలా ఒకే పార్టీకి చెందిన నేతల విరుద్ధ ప్రకటనలతో బీజేపీ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు.

ఇది ఇలా ఉంటే రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎన్నికలు పూర్తికాని సమయంలో, ఫలితాల ప్రకటించాల్సి ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఏమిటని పార్టీ పెద్దలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..