కేసీఆర్‌కు అహంకారం- లక్ష్మణ్

రాష్ట్ర ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటు వేసిన తెలంగాణ ప్రజలు.. దేశ ఎన్నికల్లో మోదీకి వేస్తారని బీజీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.  కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ అహంకారంతో మాట్లాడుతున్నారని , 16 సీట్లు గెలిచి వాళ్ళే ప్రధాని కావాలని అంటుంటే.. మూడు వందల పైగా సీట్లు గెలిచే తామేమీ కావాలి అంటూ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లో కేటీఆర్, హరీష్ రావుల మధ్య పోటీ నడుస్తోందన్న లక్ష్మణ్..టీఆర్‌ఎస్‌ నిరంకుశత్వ ధోరణికి త్వరలోనే ప్రజలు సమాధానం చెప్తారన్నారు.  తన బాగోతం […]

కేసీఆర్‌కు అహంకారం- లక్ష్మణ్
Follow us

|

Updated on: Apr 03, 2019 | 3:53 PM

రాష్ట్ర ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటు వేసిన తెలంగాణ ప్రజలు.. దేశ ఎన్నికల్లో మోదీకి వేస్తారని బీజీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.  కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ అహంకారంతో మాట్లాడుతున్నారని , 16 సీట్లు గెలిచి వాళ్ళే ప్రధాని కావాలని అంటుంటే.. మూడు వందల పైగా సీట్లు గెలిచే తామేమీ కావాలి అంటూ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లో కేటీఆర్, హరీష్ రావుల మధ్య పోటీ నడుస్తోందన్న లక్ష్మణ్..టీఆర్‌ఎస్‌ నిరంకుశత్వ ధోరణికి త్వరలోనే ప్రజలు సమాధానం చెప్తారన్నారు.  తన బాగోతం బయట పెడతా అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై లక్ష్మణ్ స్పందించారు. తనకు అక్రమ వ్యాపారాలు లేవని, ఇసుక దందాలు చేయలేదని..పార్టీ కోసం కష్టపడ్డాను కాని పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదన్నారు. ప్రస్తుతం బీజేపీలోకి  చాలా మంది నాయకులు వస్తున్నారని, ఎన్నికల తర్వాత కూడా చేరికలు ఉంటాయని లక్ష్మణ్ తెలిపారు.  తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా పార్టీగా బీజేపీని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు.