ఎంపీ వేతనాల్లో 30 శాతం కోత.. బిల్లు ఆమోదించిన రాజ్యసభ

పార్లమెంటు సభ్యులు, మంత్రుల వేతనాలు, అలవెన్సులను 30 శాతానికి తగ్గిస్తూ తీసుకువచ్చిన బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది.

ఎంపీ వేతనాల్లో 30 శాతం కోత.. బిల్లు ఆమోదించిన రాజ్యసభ
Follow us

|

Updated on: Sep 18, 2020 | 3:38 PM

పార్లమెంటు సభ్యులు, మంత్రుల వేతనాలు, అలవెన్సులను 30 శాతానికి తగ్గిస్తూ తీసుకువచ్చిన బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తరఫున తాను బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతున్నట్టు హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఈ బిల్లును తీసుకువచ్చినట్లు మంత్రి కిషన్ రెడ్డి సభకు వివరించారు. దీనిపై చర్చించిన అనంతరం బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. అనంతరం సభ శనివారం ఉదయం 9 గంటల వరకూ వాయిదా పడింది.

కాగా, శుక్రవారం రాజ్యసభలో విపక్ష ఎంపీలు తక్షణం పార్లమెంట్ సభ్యుల నిధులను పునరుద్ధరించాలని సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రవేశపెట్టిన హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ సవరణ బిల్లు-2020కు సభ ఆమోదం తెలిపింది. గత సోమవారంనాడు ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1వ తేదీతో ముగియనున్నాయి.