Breaking News
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపలేం-సీఎం కేసీఆర్‌. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు. ప్రస్తుతం ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఆర్టీసీకి ఆర్థిక భారం మోసే శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదు. హైకోర్టు తీర్పు తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం-కేసీఆర్‌
  • హైదరాబాద్‌: నేడు రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ. హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ
  • చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైందనడం సమంజసం కాదు. ఇలాంటి ప్రయోగాల్లో చిన్న సమస్యలు తలెత్తే అవకాశం సాధారణం. అంతమాత్రాన చంద్రయాన్‌-2 విఫలమైందనడం సరికాదు -కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌
  • ఎస్‌పీజీ సెక్యూరిటీ ఉపసంహరణపై ప్రియాంకాగాంధీ స్పందన. రాజకీయాల్లో భాగంగానే సెక్యూరిటీ తొలగించారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి-ప్రియాంక
  • తాజ్‌మహల్‌ పరిసరాల్లో డ్రోన్లు ఎగరేసిన విదేశీ యాత్రికులు. రష్యాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దేశంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు.. పెట్టుబడుల ఉపసంహరణ సరైన పరిష్కారం కాదు-మమతాబెనర్జీ. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం తాత్కాలిక ఉపశమనమే. ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదం చేయవు-మమత
  • సియాచిన్‌పై పాకిస్తాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. సియాచిన్‌ వివాదాస్పద ప్రాంతం. అలాంటి ప్రాంతంలో భారత్‌ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుంది. భారత్‌ నుంచి ఎలాంటి మంచిని ఆశించడంలేదన్న పాక్‌
  • ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. గౌహతి, షిల్లాంగ్‌లో కంపించిన భూమి. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం

కమల్ అంతపని చేశాడా..! నటి సంచలన వ్యాఖ్యలు

Meera Mithun sensational allegation against Kamal Haasan, కమల్ అంతపని చేశాడా..! నటి సంచలన వ్యాఖ్యలు

లోకనాయకుడు కమల్‌హాసన్‌పై నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బంధుప్రీతి ఎక్కువని.. తనకు వచ్చిన ఆఫర్‌ను కమల్, తన తనయకు ఇప్పించాడంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన మీరా.. కమల్ హాసన్ అనుకున్నది సాధించారంటూ ట్వీట్ చేసింది. ‘కోలీవుడ్‌లో నెపోటిజం పీక్స్‌లో ఉందని నిజమైంది. సినిమా నుంచి నన్ను తప్పించి తన కూతురికి అవకాశం వచ్చేలా చేశారు కమల్ హాసన్. ఇలా చేసినందుకు దర్శకుడు నవీన్‌కు, అక్షరా హాసన్‌కు, నిర్మాత శివకు సిగ్గుగా అనిపించడంలేదా? వారికి డబుల్ స్టాండర్డ్స్ బుద్ధి ఉందని బాగా తెలుస్తోంది’ అని మీరా ట్వీట్ చేసింది.

మరోవైపు మీరా చేస్తున్న ఆరోపణలపై దర్శకుడు నవీన్ స్పందించారు. ‘అగ్ని సిరాగుగల్ సినిమాలో మొదట షాలినీ పాండేను అనుకున్నాం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో అక్షర హాసన్‌ను ఎంపిక చేసుకున్నాం. ఇప్పుడు ఈ సినిమాలో అక్షర హాసనే కథానాయిక. అసలు ఈ మూవీ కోసం మేము మీరా మిథున్‌ను ఎంపిక చేసుకోలేదు. నా అనుమతి లేకుండా సినిమాలో తనను ఎంపిక చేసుకున్నామని ఆరోపిస్తోంది. మొదట నేను ఆమె మాటలు పట్టించుకోకూడదని అనుకున్నాను. కానీ ఇప్పుడు జరుగుతున్న రాద్దాంతం వల్ల స్పందించాల్సి వస్తోంది’ అని నవీన్ తెలిపారు.

అయితే వివాదాలు మీరాకు కొత్తేం కాదు. గతంలో శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ‘నమ్మ వీట్టు పిళ్లాయ్’ అనే సినిమాలో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తొలగించారని ఆమె ఆరోపించారు. అంతేకాదు బిగ్‌బాస్ 3 షోలో పాల్గొన్న సమయంలో తమిళ దర్శకుడు చరణ్‌ తనను ఎక్కడపడితే అక్కడ ముట్టుకున్నాడని ఆరోపించారు. ఇక బయట కూడా ఆమెపై పలు కేసులు ఉన్నాయి. డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులో ఇప్పటికీ ఆమెపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.