బిగ్ బాస్ 4: మెహబూబ్‌ను కావాలనే సేవ్ చేస్తున్నారా.?

ఒకవైపు ఐపీఎల్ తాకిడి.. మరోవైపు ఎలిమినేషన్స్‌కు సంబంధించిన లీకుల గోల. ఇవన్నీ చూసిన బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సీజన్‌ను తమకు నచ్చిన విధంగా నడిపిస్తున్నారు.

బిగ్ బాస్ 4: మెహబూబ్‌ను కావాలనే సేవ్ చేస్తున్నారా.?
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Oct 13, 2020 | 1:33 PM

Bigg Boss 4: ఒకవైపు ఐపీఎల్ తాకిడి.. మరోవైపు ఎలిమినేషన్స్‌కు సంబంధించిన లీకుల గోల. ఇవన్నీ చూసిన బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సీజన్‌ను తమకు నచ్చిన విధంగా నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక అదేరకమైన అభిప్రాయాన్ని పలువురు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. గత రెండు బిగ్ బాస్ సీజన్లను ఒకసారి పరిశీలిస్తే.. ఎవరో ఒక కంటెస్టెంట్ వైపు పబ్లిక్ సపోర్ట్ ఫుల్‌గా ఉండటంతో.. విజేత ఎవరన్నది ఈజీగా తెలిసిపోయేది. అయితే ఈ సీజన్‌లో మాత్రం ప్రేక్షకులకు అలాంటి హింట్‌లు ఇవ్వకుండా బిగ్ బాస్ చాలా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. తనకు నచ్చిన కంటెస్టెంట్ హౌస్‌లో ఉండాలి. అదే విధంగా ఆ కంటెస్టెంట్ స్ట్రాంగ్ కాకూడదు. ఇదే ఈ సీజన్ అజెండాలా అనిపిస్తోంది.

టిక్ టాక్ స్టార్ మెహబూబ్‌పై ఆడియన్స్‌లో ముందు నుంచే నెగటివ్ ఇంప్రెషన్ ఉంది. అతడు నిజానికి ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. మూడోవారం నామినేషన్స్‌కు ముందు రోబోట్స్- హ్యూమన్స్ టాస్క్‌లో కూడా మెహబూబ్ కాస్త ఎక్కువగానే రెచ్చిపోయాడని భావించిన ప్రేక్షకులు అతన్ని ఎలిమినేట్ చేయాలని ఫీల్ అయ్యారు. అయితే విచిత్రంగా స్ట్రాంగ్ అనిపిస్తున్న దేవి నాగవల్లిని ఎలిమినేట్ చేసేసి.. ప్రతీ టాస్క్‌లోనూ మసాలాను అందిస్తున్న మెహబూబ్‌ను కాపాడేశారు.

అంతేకాదు బీబీ హోటల్ టాస్క్‌లో మెహబూబ్ నోటికి పని చెప్పడంతో మిగతా హౌస్‌మేట్స్ అందరూ కూడా ఈ వారం నామినేషన్స్‌లో అతడ్ని టార్గెట్ చేశారు. ఇక మెహబూబ్ ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడనుకున్న తరుణంలోనే కెప్టెన్ సోహైల్‌కి ఒక పవర్ ఇచ్చి నామినేషన్స్‌లోని ఒకరిని బిగ్ బాస్ కాపాడమన్నాడు. సోహైల్‍కి హౌస్‍లో క్లోజ్‍ ఫ్రెండ్‍ మెహబూబ్‍.. ఇంకేముంది అతడ్ని కాపాడతానని సోహైల్ బిగ్ బాస్‌కు చెప్పాడు. ఈ విషయం బిగ్ బాస్‌కి కూడా తెలుసు. అందుకే కావాలని సోహైల్‌కు ఆ పవర్ ఇచ్చి మరో రెండు వారాల పాటు మెహబూబ్‌ను సేవ్ చేశాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అలాగే అభిజిత్‌, అఖిల్, సోహైల్‌లను డిఫెన్స్‌లో పడేసేలా.. వీకెండ్‌లో నాగార్జున వారికి కాస్త డోస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మోనాల్-అభిజిత్ లవ్ స్టోరీకి కూడా ఈ వారంతో ఫుల్ స్టాప్ పడేలా ఉంది. ఇలా రోజుకో ఎత్తుకు పైఎత్తుతో బిగ్ బాస్ పూర్తి షోనే మార్చేస్తున్నట్లు కనిపిస్తోంది.