వామ్మో! అరియానాకు బిగ్ బాస్ అంత రెమ్యునరేషన్ ఇస్తున్నాడా.?

కింగ్ అక్కినేని నాగార్జున హోస్టుగా బిగ్ బాస్ నాలుగో సీజన్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. అరియానాకు బిగ్ బాస్ పెద్ద మొత్తంలో పారితోషికం ఇస్తున్నాడని టాక్.

వామ్మో! అరియానాకు బిగ్ బాస్ అంత రెమ్యునరేషన్ ఇస్తున్నాడా.?
Follow us

|

Updated on: Oct 07, 2020 | 9:02 PM

Bigg Boss 4: తెలుగు రాష్ట్రాల్లో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ సాధిస్తున్న రియాలిటీ షోల్లో బిగ్ బాస్ కూడా ఒకటి. కింగ్ అక్కినేని నాగార్జున హోస్టుగా బిగ్ బాస్ నాలుగో సీజన్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు చాలామంది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. దీనితో బిగ్ బాస్ మొదటి వారం సోసోగానే నడిచింది. అయితే రెండు వారం నుంచి మాత్రం ఊపందుకున్న ఈ రియాలిటీ షో ఇంటరెస్టింగ్ టాస్కులు, రొమాన్స్‌లు, హగ్గులతో ఫ్యాన్స్‌ను బాగా అలరిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారు.! తమ అభిమాన కంటెస్టెంట్‌దే హయ్యస్ట్ రెమ్యునరేషన్ అంటూ ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. యాంకర్ లాస్య అందరి కంటే అత్యధిక పారితోషికం తీసుకుంటోందని కూడా రూమర్లు వచ్చాయి.

అయితే ఇప్పుడు తాజాగా మరో కంటెస్టెంట్ పారితోషికం గురించి నెట్టింట్లో పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆమె మరెవరో కాదు అరియనా గ్లోరీ.. గ్లామర్‌తో పాటు ముద్దు ముద్దు మాటలతో అరియనా ఫ్యాన్స్‌ను మాయ చేస్తోంది. మొదటి వారం పెద్దగా స్క్రీన్ ప్రెజన్స్ లేకపోయినా.. రెండో వారం నుంచి ప్రతి టాస్క్‌లోనూ చురుకుగా పాల్గొంటూ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తోంది. ఇక గత కొద్దిరోజులుగా అవినాష్‌తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు. వీళ్లిద్దరి పెర్ఫార్మన్స్‌ను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి.

కాగా, ప్రతి టాస్క్‌లోనూ అద్భుతంగా పెర్ఫర్మ్ చేస్తూ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ప్రూవ్ చేసుకుంటున్న అరియనా గ్లోరీ రెమ్యునరేషనే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అరియానాకు బిగ్ బాస్ పెద్ద మొత్తంలో పారితోషికం ఇస్తున్నాడని టాక్. బిగ్ బాస్ సీజన్‌4లో పార్టిసిపేట్ చేసినందుకు గానూ అరియనా వారానికి లక్షకుపైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే ఇది తక్కువే అయినా.. ఆమె కెరీర్‌కు మాత్రం బిగ్ బాస్ పెర్ఫెక్ట్ వేదికగా మారిందని చెప్పడంలో సందేహం లేదు.