ఏపీ పాలిటిక్స్‌లో ‘మతం’ లొల్లి.. ఇంగ్లీష్ మీడియంకు, మతానికి లింకేంటి.?

మతం అనేది వ్యక్తిగత అంశం.. ఏ మతాన్ని అనుసరించాలన్నది సదరు వ్యక్తికి సంబంధించిన స్వగతం అని రాజ్యాంగం సైతం చెబుతోంది. కానీ రాజకీయం దగ్గరకి వచ్చేసరికి ఇలాంటిది ఏమి ఉండదు. ఎన్ని రకాల ట్విస్టులు ఇచ్చినా పట్టింపు లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మతం అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం సర్కారీ బడుల్లో ఇకపై ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని తీసుకుని బీజేపీ ఇంగ్లీష్ […]

ఏపీ పాలిటిక్స్‌లో 'మతం' లొల్లి.. ఇంగ్లీష్ మీడియంకు, మతానికి లింకేంటి.?
Follow us

|

Updated on: Nov 18, 2019 | 9:53 PM

మతం అనేది వ్యక్తిగత అంశం.. ఏ మతాన్ని అనుసరించాలన్నది సదరు వ్యక్తికి సంబంధించిన స్వగతం అని రాజ్యాంగం సైతం చెబుతోంది. కానీ రాజకీయం దగ్గరకి వచ్చేసరికి ఇలాంటిది ఏమి ఉండదు. ఎన్ని రకాల ట్విస్టులు ఇచ్చినా పట్టింపు లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మతం అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.

ఏపీ ప్రభుత్వం సర్కారీ బడుల్లో ఇకపై ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని తీసుకుని బీజేపీ ఇంగ్లీష్ మీడియానికి, క్రిస్టియానిటీకి లింక్ పెట్టడం ఇప్పుడు పెద్ద దుమారానికి తెర తీసింది. అంతేకాకుండా తిరుమల ప్రసాదం గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తిరుమల డిక్లరేషన్‌లో రాయడం గురించి టీడీపీ నేతలు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా వైఎస్సాఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వెనుక మతమార్పిడి అంశం ఉందనే విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అసలు ఏపీలో ఏం జరుగుతోంది.? మతం అనే అంశం ఎందుకు తెర మీదకు వచ్చింది.? అనే విషయాలపై టీవీ 9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా చర్చ జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..