Breaking News
  • సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత. సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స. కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్‌ యాదవ్‌.
  • తెలంగాణలో ఇవాళ కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ లో ఇప్పటి వరకు 471కరోనా పాజిటివ్ కేసులు . ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల నుంచి 45 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 412 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
  • ఈ రోజుతో మార్కస్ కు వెళ్లిన వారితో పాటు 665 టెస్టులు చేస్తే 18 మాత్రమే . 385 మంది మార్కస్ కాంటాక్ట్స్. 45 మంది డిశ్చార్జ్. మొత్తం 414 మంది ట్రీట్మెంట్స్ పొందుతున్నారు. తెలంగాణలో 1ఒక్కరు మాత్రమే వెంటిలేటర్ పై ఉన్నారు. 22 కళ్ళ అందరూ డిశ్చార్జ్ అవుతారు.
  • లాక్‌డౌన్‌తో చుక్కేసుకుంటే కానీ చక్కగా ఉండలేని మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. బ్లాక్‌లో వేలకు వేలు పోసి లిక్కర్‌ బాటిళ్లు కొనుక్కుంటున్నారు. అంత డబ్బు పెట్టలేని సామాన్యులు మాత్రం పిచ్చేక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వైన్‌షాపులు తెరచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారు.
  • నిజామాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.

Bank Employee Crime: శృంగార క్యాషియర్.. లోన్ కోసం వచ్చిన 40 మంది మహిళలను…

పేరుకు అతడొక బ్యాంక్ క్యాషియర్.. కానీ సీక్రెట్‌గా చేసే పనులు వింటే షాక్ అవ్వాల్సిందే. రోజూ బ్యాంక్‌కు రుణాల కోసం వచ్చే మహిళలను లోబరుచుకుని.. వారితో ఉల్లాసంగా గడుపుతుంటాడు.
Bank Employee Crime Story, Bank Employee Crime: శృంగార క్యాషియర్.. లోన్ కోసం వచ్చిన 40 మంది మహిళలను…

Bank Employee Crime: పేరుకు అతడొక బ్యాంక్ క్యాషియర్.. కానీ సీక్రెట్‌గా చేసే పనులు వింటే షాక్ అవ్వాల్సిందే. రోజూ బ్యాంక్‌కు రుణాల కోసం వచ్చే మహిళలను లోబరుచుకుని.. వారితో ఉల్లాసంగా గడుపుతుంటాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు ఈ కామాంధుడు. భర్త సాగించిన రాసలీలల వీడియోలను, ఫోటోలను కట్టుకున్న భార్యే బట్టబయలు చేయడంతో ఈ ఉదంతం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఇక అరెస్ట్ చేస్తారనే భయంతో ఆ ప్లే‌బాయ్ భర్తతో సహా ఐదుగురు కుటుంబసభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Also Read: Lakhs Of Rupees For Old Coins And Notes

వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) వీరలిమలైలోని ఇండియన్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 2వ తేదీన అతడికి రెడ్డిపాళయానికి చెందిన యువతి(32)తో వివాహం జరిగింది. అయితే పెళ్ళైన రోజు నుంచి జయకుమార్ ఆమెతో సఖ్యతగా ఉండటం లేదు. రోజూ గంటల తరబడి వేరే గదిలో వెళ్లి పలువురి మహిళలతో ఫోన్లో అశ్లీలంగా మాట్లాడటం అతడి భార్య గమనిస్తూ వచ్చింది.

అసలు విషయమేంటని తెలుసుకోవడానికి ఒకరోజు భర్త బ్యాంక్‌కు వెళ్లిన సమయంలో ఆ గదిలోకి వెళ్లగా..  అక్కడ ఆమెకు 15 సెల్‌ఫోన్లు, వాటిల్లో భర్త జయకుమార్ వేరే మహిళలతో అర్ధనగ్నంగా, నగ్నంగా దిగిన ఫోటోలు, బాత్‌రూమ్ వీడియోలు కనిపించాయి. అవన్నీ చూసి ఆమె ఒక్కసారిగా విస్తుపోయింది. ఈ దారుణాలను తన అత్తింటివారితో చెప్పుకుని సదరు యువతి విలపించింది. అయితే వాళ్లు ఆమె మాటలు అసలు పట్టించుకోలేదు. అంతేకాకుండా అతడి రహస్య విషయాలన్నీ బహిర్గతం కావడంతో జయకుమార్ ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు.

‘నువ్వు స్నానం చేసేటప్పుడు సీక్రెట్‌గా వీడియో తీశాను. నా విషయాలు బయటపెడితే సోషల్ మీడియాలో ఆ దృశ్యాలను వైరల్ చేస్తానని బెదిరించాడు’. దీనికి అతడి సహోద్యోగిని దేవీ బిలోమినా కూడా సహకరించింది. దీంతో ఆ యువతి చేసేదేమిలేక తల్లిదండ్రుల దగ్గర తన గోడు చెప్పుకుంది.

Also Read: IIT Professor Hidden Camera In Washroom

ఇక తన రహస్య కార్యకలాపాలన్నీ బయటపెట్టిన భార్యను ఎలాగైనా చంపాలని స్కెచ్ వేశాడు. అతడి బారి నుంచి ఆమె రెండుసార్లు తప్పించుకుంది. ఈ ఆగడాలను తంజావూరు సర్కిల్ డీఐజీ లోకనాథన్‌కు ఫిర్యాదు చేసింది. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు జయకుమార్, అతడి సహోద్యోగిని దేవీ బిలోమినా, కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Related Tags