మళ్లీ హిందూపురం నుంచే బాలయ్య

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బెర్తులు ఖరారు చేస్తున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హిందూపురం నియోజకవర్గాన్ని మళ్లీ బాలకృష్ణకే కేటాయించినట్లు తెలుస్తోంది. 2014లో హిందూపురం నుంచి పోటీ చేసిన బాలయ్య మంచి మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఈ సారి కూడా ఆ టికెట్‌ను తన బావమరిదికే కేటాయించినట్లు సమాచారం. తాజాగా అనంతపురంలోని 14 […]

మళ్లీ హిందూపురం నుంచే బాలయ్య
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 07, 2019 | 2:53 PM

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బెర్తులు ఖరారు చేస్తున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హిందూపురం నియోజకవర్గాన్ని మళ్లీ బాలకృష్ణకే కేటాయించినట్లు తెలుస్తోంది. 2014లో హిందూపురం నుంచి పోటీ చేసిన బాలయ్య మంచి మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఈ సారి కూడా ఆ టికెట్‌ను తన బావమరిదికే కేటాయించినట్లు సమాచారం.

తాజాగా అనంతపురంలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు 5స్థానాలను ఇంకా పెండింగ్‌లో పెట్టారు. ఈ క్రమంలో పరిటాల సునీత, కాలువ శ్రీనివాస్‌లకు రాప్తాడు, రాయదుర్గం టికెట్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీకి చంద్రబాబు ఓకే చెప్పినట్లు సమాచారం.