పంజాబ్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య.. పోలీసులకు సవాలుగా మారిన కేసు..

ఒకే ఇంట్లో నలుగురు హత్యకు గురైన సంఘటన పంజాబ్‌లోని లూథియానా, మయూర్, విహార్ కాలనీలో జరిగింది. ఇంటి యజమాని జాడ మాత్రం తెలియలేదు. అతడే వీరందరిని చంపి ఎస్కేప్ అయ్యాడా?

  • uppula Raju
  • Publish Date - 6:19 pm, Tue, 24 November 20
పంజాబ్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య.. పోలీసులకు సవాలుగా మారిన కేసు..

ఒకే ఇంట్లో నలుగురు హత్యకు గురైన సంఘటన పంజాబ్‌లోని లూథియానా, మయూర్, విహార్ కాలనీలో జరిగింది. ఇంటి యజమాని జాడ మాత్రం తెలియలేదు. అతడే వీరందరిని చంపి ఎస్కేప్ అయ్యాడా? లేదంటే డబ్బు కోసం ఎవరైనా అతడిని కిడ్నాప్ చేశారా అనేది తేలాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సోమవారం రాత్రి రాజీవ్ సూరి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో అతడి భార్య సునీత, కొడుకు అశిష్, కోడలు గరిమ, అతడి 13 సంవత్సరాల మనవడు హత్యకు గురై ఉన్నారు. ఉదయం గరిమ తండ్రి కూతురును చూసేందుకు రాజీవ్ ఇంటికి రాగా ఇంటి లోపలి నుంచి గడియ వేసి ఉండటం గమనించాడు. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో ఇరుగు పొరుగు వారిని విచారించాడు. అయినా జాడ తెలియకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఇంటికి వచ్చి తలుపులు పగులకొట్టి చూడగా నలుగురు రక్తం మడుగులో పడి ఉన్నారు. రాజీవ్ సూరి మాత్రం కనిపించలేదు. పోలీసులు మ‌ృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీగా మారిన ఈ ఘటన స్థానికులను భయ కంపితులను చేస్తోంది.