Best Life Partners: ఈ రాశులకు చెందిన జీవిత భాగస్వామితో అన్నీ అనుకూలతలే..!

ఏ రాశికి చెందిన జీవిత భాగస్వామి విధేయంగా ఉంటారు? ఎవరితో జీవితం పంచుకుంటే సుఖపడతారు? సాధారణంగా వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశుల వారితో జీవితం ప్రేమలోనైనా, పెళ్లిలోనైనా సవ్యంగా, హ్యాపీగా, సాఫీగా సాగిపోతుందని జ్యోతిష గ్రంథాలు చెబుతు న్నాయి. విధేయత, అణకువ, అన్యోన్యత వంటి లక్షణాలకు వచ్చేసరికి ఈ రాశుల వారిని గొప్పగా చెప్పుకుంటారు.

Best Life Partners: ఈ రాశులకు చెందిన జీవిత భాగస్వామితో అన్నీ అనుకూలతలే..!
Best Life Partner
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 26, 2024 | 6:04 PM

ఏ రాశికి చెందిన జీవిత భాగస్వామి విధేయంగా ఉంటారు? ఎవరితో జీవితం పంచుకుంటే సుఖపడతారు? సాధారణంగా వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశుల వారితో జీవితం ప్రేమలోనైనా, పెళ్లిలోనైనా సవ్యంగా, హ్యాపీగా, సాఫీగా సాగిపోతుందని జ్యోతిష గ్రంథాలు చెబుతు న్నాయి. విధేయత, అణకువ, అన్యోన్యత వంటి లక్షణాలకు వచ్చేసరికి ఈ రాశుల వారిని గొప్పగా చెప్పుకుంటారు. సంబంధ బాంధవ్యాలు, స్నేహాలు, కుటుంబ బంధాలు వంటి విషయాల్లో ఈ రాశుల వారు ముందు వరుసలో ఉంటారు. వీరు ఒకసారి ‘బంధం’లో పడితే కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా నిలబడతారు. ఈ రాశుల వారి ప్రేమ, వివాహ బంధాలు ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతున్నదీ పరిశీలిద్దాం.

  1. వృషభం: విధేయత, అణకువ, అన్యోన్యతల విషయంలో వీరు ఇతర రాశుల వారి కంటే ముందు వరుసలో ఉంటారు. ఈ రాశ్యధిపతి శుక్రుడు ప్రేమకు, అందానికి, అనుబంధాలకు కారకుడు. వృషభ రాశి మహిళ ఎవరినైనా ప్రేమించినా, పెళ్లాడినా ఆ జీవితానికి, ఆ వ్యక్తికి పూర్తిగా, మనస్ఫూర్తిగా కట్టు బడి ఉంటుంది. ఈ రాశికి చెందిన యువతులు ఎక్కువగా స్థిరత్వాన్ని, భద్రతను కోరుకుంటారు. ఈ ఏడాది వృషభ రాశి యువతుల నుంచి మరింత ప్రేమానురాగాలు లభిస్తాయని చెప్పవచ్చు.
  2. కర్కాటకం: ఈ రాశివారు ప్రేమ వ్యవహారాల్లోనూ, అనుబంధాల్లోనూ భావోద్వేగపరమైన సంబంధాలు ఏర్ప రచుకుంటారు. ఈ రాశికి చంద్రుడు అధిపతి అయినందువల్ల ఈ రాశివారు ఎవరు ఎటువంటి వ్యక్తి అన్నది తేలికగా గ్రహిస్తారు. సాధారణంగా జీవిత భాగస్వామి అభిరుచులకే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. నిస్వార్థంగా ప్రేమించడం, వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి నుంచి ప్రేమ తప్ప మరేమీ ఆశించకపోవడం జరుగుతుంది. ఈ ఏడాది వీరి మానసిక బంధం మరింత పటిష్ఠం అవుతుంది.
  3. కన్య: ఈ రాశికి బుధుడు అధిపతి అయినందువల్ల ఈ రాశివారు ఏ విషయంలోనైనా ఆచితూచి వ్యవ హరిస్తారు. ఎంతో దూరం ఆలోచించి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం జరుగుతుంది. ఒకసారి జీవిత భాగస్వామిని ఎంచుకున్న తర్వాత అతనికే కట్టుబడి ఉండడం జరుగుతుంది. జీవిత భాగ స్వామిని ఒక స్నేహితుడిగా పరిగణించడం జరుగుతుంది. ఈ ఏడాదంతా బుధుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల వీరు జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకునే అవకాశం ఉంది.
  4. ధనుస్సు: ఈ రాశికి గురువు అధిపతి అయినందువల్ల ఈ రాశివారిలో ఆదర్శవంతమైన జీవితం గడపాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకూ అన్యోన్యంగా జీవితం గడపడానికే ప్రాధాన్యం ఇస్తారు. వీరి ప్రేమలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉండదు. వీరిలోని ప్రేమలు, అనుబం ధాలు లోతుగా ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా భరించే శక్తి కూడా ఉంటుంది. ప్రస్తుతం గురు గ్రహం వృషభ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల వీరి ప్రేమ బంధం మరింత పటిష్ఠం అవుతుంది.
  5. మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు నీతి నిజాయతీలను గౌరవించే గ్రహం. ఎవరితోనైనా ప్రేమలో పడినా, పెళ్లి అయినా జీవితాంతం ఆ వ్యక్తికే కట్టుబడి ఉండడం అనేది వీరి సహజ లక్ష ణం. వీరిలోని ప్రేమ, అనుబంధం చెక్కు చెదరదు. జీవిత భాగస్వామిని అత్యధికంగా ప్రేమించడంతో పాటు, అత్యధికంగా గౌరవించడం జరుగుతుంది. కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండడం జరుగుతుంది. ఈ ఏడాది వీరు బంధాన్ని మరింత దృఢపరచుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది.
  6. మీనం: ఈ రాశికి అధిపతి అయిన గురువు సంప్రదాయాలను గౌరవించే గ్రహం. ఆచార సంప్రదాయాలకు పూర్తిగా కట్టుబడి ఉండే తత్వం అయినందువల్ల ప్రేమ వ్యవహారాలను, వైవాహిక బంధాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తారు. సాధారణంగా వీరి బంధం భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. బాగా సున్నిత మనస్కులు అయినందువల్ల జీవిత భాగస్వామిని కష్టపెట్టడం జరగదు. ఈ ఏడా దంతా గురువు స్థిర రాశిలో సంచారం చేస్తున్నందువల్ల వీరి ప్రేమలు మరింత స్థిరంగా కొనసాగుతాయి.

Latest Articles