Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..! మీ బర్త్ డే ఇందులో ఉందా..?

మూలాంకం 3కు చెందినవారిగా భావించే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారి స్వభావం, వ్యక్తిత్వ లక్షణాల గురించి సంఖ్యాశాస్త్రంలో ఆసక్తికరమైన విశ్వాసాలు ఉన్నాయి. గురు గ్రహ ప్రభావంతో వీరిలో సింప్లిసిటీ, నిజాయితీ, జ్ఞానంపై ఆసక్తి వంటి లక్షణాలు కనిపిస్తాయని న్యూమరాలజీ చెబుతోంది.

Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..! మీ బర్త్ డే ఇందులో ఉందా..?
Numerology

Updated on: Sep 16, 2026 | 7:31 PM

సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని నమ్ముతారు. వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, వ్యక్తిత్వ లక్షణాల గురించి జన్మతేదీ ఆధారంగా కొన్ని విషయాలను అంచనా వేయవచ్చని న్యూమరాలజీ చెబుతుంది. ఈ క్రమంలో ఏదైనా నెలలో 3, 12, 21 లేదా 30 తేదీల్లో జన్మించిన వారిని మూలాంకం 3కు చెందినవారిగా పరిగణిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలాంకం 3కి అధిపతిగా బృహస్పతి (గురు) గ్రహాన్ని పరిగణిస్తారు. అందువల్ల ఈ తేదీల్లో జన్మించినవారిలో సింప్లిసిటీ, నిజాయితీ, జ్ఞానంపై ఆసక్తి వంటి లక్షణాలు కనిపిస్తాయని న్యూమరాలజీ విశ్వాసాలు చెబుతున్నాయి.

మూలాంకం 3 కలిగిన వారు తమ మనసులో ఉన్న విషయాలను దాచకుండా నేరుగా చెప్పే స్వభావం కలిగి ఉంటారని సంఖ్యా శాస్త్రంలో చెబుతారు. ఇతరులను మోసం చేయడం లేదా వెనుక నుంచి విమర్శించడం వీరి స్వభావానికి దూరంగా ఉంటుందని నమ్మకం. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడటం వీరి ప్రత్యేకతగా చెబుతారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏదో ఒక మంచి విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తారని చెబుతారు. కొత్త విషయాలను ఆసక్తిగా స్వీకరించే స్వభావం కూడా ఉంటుందట.

సంఖ్యాశాస్త్రం మేరకు ఈ తేదీల్లో జన్మించినవారు నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారని చెబుతారు. అలాగే స్నేహపూర్వకంగా ఉండటం, కొత్త వ్యక్తులతో త్వరగా కలిసిపోవడం, సంబంధాలను నిజాయితీగా కొనసాగించడం వంటి లక్షణాలు వీరిలో ఉంటాయని చెబుతారు.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కథనంలోని అంశాలు సంఖ్యాశాస్త్ర విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా చెప్పబడినవే తప్ప శాస్త్రీయంగా నిర్ధారించబడిన విషయాలు కావు.

Loading...
Unable to load recommendations.
Follow Us