
Numerology Tips: వివాహం విషయంలో అమ్మాయిలకు మంచి జీవిత భాగస్వామి దొరకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలు మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారట. ముఖ్యంగా మూల సంఖ్య 2 (Mulank 2) కలిగిన అబ్బాయిల్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వీరు భర్తగా రావాలంటే పుట్టి పుట్టాలని చెబుతారు సంఖ్యాశాస్త్ర నిపుణులు.
ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 2 అవుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ సంఖ్యకు చంద్రుడు అధిపతి. అందువల్ల వీరు సున్నిత మనస్కులుగా, భావోద్వేగాలను అర్థం చేసుకునే వ్యక్తులుగా ఉంటారని చెబుతారు.
మూల సంఖ్య 2 కలిగిన అబ్బాయిలు కుటుంబ సభ్యుల సంతోషానికి ప్రాధాన్యత ఇస్తారని న్యూమరాలజీ చెబుతోంది. పెద్దలను గౌరవించడం, కుటుంబ బంధాలను నిలబెట్టుకోవడం వీరి ప్రత్యేకతలుగా చెబుతారు.
అలాగే అనవసరమైన వివాదాలు, వాదనలకు వీరు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. సమస్యలు ఎదురైనప్పుడు ప్రశాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు.
భార్య భావోద్వేగాలను, అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.
వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారని చెబుతారు. ఇతరుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు.
న్యూమరాలజీ ప్రకారం మూల సంఖ్య 2 కలిగిన అబ్బాయికి 1, 3, 6 మూల సంఖ్యల అమ్మాయితో పెళ్లి చేస్తే మంచి అనుకూలత ఉంటుందని చెబుతారు. అదే మూల సంఖ్య కలిగిన వారితో కూడా మంచి అనుబంధం ఏర్పడే అవకాశం ఉందని విశ్వసిస్తారు.
గమనిక: ఈ కథనంలోని అంశాలు సంఖ్యాశాస్త్రంలో ఉన్న సంప్రదాయ నమ్మకాలు మాత్రమే. వివాహ బంధం విజయవంతం కావడానికి పరస్పర అవగాహన, ప్రేమ, గౌరవం, నమ్మకం ఎంతో ముఖ్యం. కేవలం పుట్టిన తేదీ ఆధారంగా జీవిత భాగస్వామిని నిర్ణయించకూడదు.