Money Astrology: హమ్మయ్య.. బుధుడితో వారి ఆర్థిక సమస్యలకు పరిష్కారం..!

Budha Gochar 2026: బుధుడు ఈ నెల(ఏప్రిల్) 30 నుంచి మే 14 వరకు మేష రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. బుధుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు వంటివి బాగా లాభిస్తాయి. వీరిని తప్పకుండా కొన్ని ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేయడం జరుగుతుంది. ఈ బుధుడి వల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీన రాశుల వారి జీవితాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

Money Astrology: హమ్మయ్య.. బుధుడితో వారి ఆర్థిక సమస్యలకు పరిష్కారం..!
Money Astrology

Edited By:

Updated on: Apr 21, 2026 | 5:07 PM

Mercury Transit 2026: తెలివితేటలు, సమయస్ఫూర్తి, వివేకం, విజ్ఞానం వంటి అంశాలకు కారకుడైన బుధుడు ఈ నెల(ఏప్రిల్) 30 నుంచి మే 14 వరకు మేష రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. బుధుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు వంటివి బాగా లాభిస్తాయి. వీరిని తప్పకుండా కొన్ని సమస్యల నుంచి బయటపడేయడం జరుగుతుంది. ఈ బుధుడి వల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీన రాశుల వారి జీవితాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.

  1. మేషం: ఈ రాశిలో బుధ సంచారం జరుగుతున్నందువల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత, ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక, గృహ ఒప్పందాలు కుదర్చుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.
  2. మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం ఫలవంతం అవుతాయి. ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగంలో ఈ రాశివారి సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వీరి సలహాలు, సూచనలతో అధికారులు లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడ తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణులవుతారు.
  4. తుల: ఈ రాశికి సప్తమంలో బుధ సంచారం వల్ల ఆస్తి, ఆర్థిక, గృహ సంబంధమైన ఒప్పందాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో కుటుంబ, దాంపత్య సమస్యల నుంచి బయటపడతారు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో బుధ సంచారం వల్ల షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు లాభాల పంట పండిస్తాయి. మీ సలహాలు, సూచనల వల్ల ఉద్యోగంలో అధికారులే కాక, బంధు మిత్రులు కూడా బాగా లబ్ధి పొందుతారు. ఆదాయవృద్ది ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. విదేశీయానానికి అవకాశాలు లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంతాన యోగానికి అవకాశముంది. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  6. మీనం: ఈ రాశికి ధన స్థానంలో బుధ సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశీయానానికి అవకాశాలు లభిస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. దీనిని ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us