Budh Gochar 2026: తులారాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో గోల్డెన్ ఛాన్స్!

Mercury Transit 2026: జ్యోతిష్య అంచనాల ప్రకారం 2026 సెప్టెంబర్ 26న బుధుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం వల్ల అన్ని రాశులపై ప్రభావం చూపే అవకాశముందని జ్యోతిష్య పండితులు అంచనావేస్తున్నారు. అయితే మరీ ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు రాశులకు కెరీర్, వ్యాపారం, ఆర్థిక అంశాల్లో అనుకూల ఫలితాలు ఉండవచ్చని చెబుతున్నారు.

Budh Gochar 2026: తులారాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో గోల్డెన్ ఛాన్స్!
Budh Gochar

Updated on: Sep 23, 2026 | 4:05 PM

Mercury Transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని బుద్ధి, మాటతీరు, వ్యాపారం, కమ్యూనికేషన్‌కు కారకుడిగా పరిగణిస్తారు. మిథునం, కన్య రాశులకు బుధుడు అధిపతి. గ్రహాల సంచారంలో బుధుడి గోచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని జ్యోతిష్య నమ్మకాలు చెబుతున్నాయి. జ్యోతిష్య అంచనాల ప్రకారం సెప్టెంబర్ 26, 2026న బుధుడు తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. తులా రాశికి అధిపతి శుక్రుడు. బుధుడి ఈ సంచారం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే ముఖ్యంగా నాలుగు రాశుల వారికి కెరీర్, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

మిథున రాశి

మిథున రాశికి బుధుడు అధిపతి కావడంతో ఈ గోచారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరుగుదలకు సంబంధించిన అవకాశాలు దక్కుతాయి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు సమాజంలో గౌరవం, గుర్తింపు పొందే పరిస్థితులు ఏర్పడుతాయి. ఆర్థికంగా కూడా మెరుగైన పరిస్థితులకు అవకాశముంది.

కర్కాటక రాశి

బుధుడి తులా గోచారంతో కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపడే అవకాశముంది. కుటుంబంలో సుఖసంతోషాలు, ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో పెద్ద డీల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉండటంతో పాటు అదృష్టం కూడా కలిసివస్తుంది.

ఇవి కూడా చదవండి

సింహ రాశి

బుధుడి గోచారం సింహ రాశి వారికి కెరీర్‌లో కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరగడం లేదా కీలక పదవి లభించే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు పేర్కొంటున్నాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ గోచారం ఆర్థికంగా అనుకూల మార్పులు తీసుకొస్తుంది. గతంలో ఎదురైన కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు, లాభాలు దక్కే అవకాశముంది. వ్యాపారంలో పురోగతితో పాటు పెట్టుబడుల ద్వారా కూడా ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు అందుకుంటారు.

గమనిక: ఈ కథనంలోని ఫలితాలు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న నమ్మకాలు, అంచనాల ఆధారంగా అందించబడినవి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా పరిగణించకూడదు.

Loading...
Unable to load recommendations.
Follow Us