AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాశిఫలాలు మే 06, 2026: వారికి ఉద్యోగంలో ఆకస్మిక శుభ పరిణామం.. మీ రాశికి ఇలా..

దిన ఫలాలు (మే 6, 2026): ఈ రోజు చాలా రాశుల వారికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి, ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా మేషం నుంచి మీనం వరకు కొన్ని రాశుల వారికి అధికార యోగాలు, శుభ పరిణామాలు, కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే రోజంతా అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది.

రాశిఫలాలు మే 06, 2026: వారికి ఉద్యోగంలో ఆకస్మిక శుభ పరిణామం.. మీ రాశికి ఇలా..
Rashifal In Telugu 06 May 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2026 | 5:45 AM

Share

దిన ఫలాలు (మే 6, 2026): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో సొంత లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు, తోటి ఉద్యోగులకు సాయపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు ఆధారపడడం ఎక్కువవుతుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు బిజీగా సాగుతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఎటువంటి ప్రయత్నమైనా ఆశించిన ఫలితాన్నిస్తుంది. పిల్లల నుంచి అనుకోని శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇతర ఉద్యోగాలకు వెళ్లాలన్న మీ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చుల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో బాధ్యతలు, లక్ష్యాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో సొంత లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు, తోటి ఉద్యోగులకు సాయపడతారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాలను విస్తరించడానికి ఇది సమయం కాదు. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా సానుకూలంగా ముందుకు సాగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిళ్ల నుంచి కొంతవరకు బయటపడతారు. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇతరుల గొడవల్లో జోక్యం చేసుకోవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. వ్యాపార భాగస్వాములతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆదరణ లభిస్తుంది. ప్రోత్సాహకాలు అందుతాయి. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. తోబుట్టువులతోనూ, దగ్గర బంధువులతోనూ చాలా కాలంగా కొనసాగుతున్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారం విషయంలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొందరు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొద్దిపాటి ఇబ్బందులున్నప్పటికీ సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబంలో ఒక రికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆలోచనలను, ప్రయత్నాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలనిస్తాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులకు సహకారం అందిస్తారు. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులు ఆఫర్లు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయం నిలకడగా ఉంటుంది. కెరీర్ పరంగా సానుకూల వాతావరణం ఉంటుంది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపా రాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందుతాయి. మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. ఇంటా బయటా శ్రమాధిక్యత ఉంటుంది. కొద్దిగా ఆరోగ్య సమస్యలుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. కొద్దిగా వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సహోద్యోగులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష‌్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. అటు ఉద్యోగపరంగానే కాక, వ్యాపారపరంగా కూడా ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు. సోదరులతో అనుకోకుండా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. పెద్దల సాయంతో కుటుంబ వ్యవహారాలు చక్కబెడతారు. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలపరంగా అదృష్టం బాగానే కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగు పడుతుంది. ఒకటి రెండు ప్రధానమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు బంధువులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆస్తి లేదా సంపద కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవ సరం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పెండింగ్ పనులు తేలికగా పూర్తవుతాయి.

Follow Us