Horoscope Today: ఈ రాశుల వారికి మానసిక ఆందోళన పెరుగుతుంది.. ఆదివారం రాశి ఫలాలు..

|

Jun 05, 2022 | 6:46 AM

ఈరోజు మీడియా, కళారంగంలో వారికి వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన పెరుగుతుంది

Horoscope Today: ఈ రాశుల వారికి మానసిక ఆందోళన పెరుగుతుంది.. ఆదివారం రాశి ఫలాలు..
Follow us on

మేష రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులను అనుహ్యంగా వాయిదా వేస్తారు.. నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడం మంచిది కాదు.. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. కుటుంబంలో మానసిక ఆందోళన పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

వృషభ రాశి..
ఈరోజు మీడియా, కళారంగంలో వారికి వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. స్త్రీలమ మూలకంగా ధనలాభం ఉంటుంది.

మిథున రాశి..
ఈరోజు వీరు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.. దూరం ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన ఉంటుంది. విదేశయాన మార్గం సుగమవుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

కర్కాటక రాశి..
ఈరోజు వీరు గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. దైవదర్శనం చేసుకుంటారు. శుభవార్తలు వింటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.

సింహ రాశి..
కొత్తవారితో పరిచయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో విరోధం ఏర్పడుతుంది.

కన్య రాశి..
ఈరోజు వీరికి నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది.. ఇతరులకు దూరంగా ఉండడం మంచిది. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు అవసరం.. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

తుల రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపారరంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.. కొత్త పనులను ప్రారంభిస్తారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

వృశ్చిక రాశి..
ఈరోజు వీరు చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మానసిక వేదన ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. కొత్త పనులు మొదలు పెట్టకపోవడం మంచిది.అనారోగ్య సమస్యలు ఉంటాయి. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనుస్సు రాశి..
ఈరోజు వీరు గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది.

మకర రాశి..
ఈరోజు వీరు శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.. బంధుమిత్రులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలు చేయడం వలన లాభం ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కుంభ రాశి..
ఈరోజు వీరికి మిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబవిషయాల్లో జాగ్రత్తలు అవసరం.

మీన రాశి..
ఈరోజు వీరు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు.

గమనిక: రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.