Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది

|

Dec 11, 2021 | 5:03 AM

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది..

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది
Follow us on

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. డిసెంబర్‌ 11 (శనివారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం

మేష రాశి:
మీమీ రంగాలలో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వృషభ రాశి:
ఆరోగ్యంపై దృష్టి సారించాలి. మానసిక శక్తి పెంచుకోవడం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.

మిథున రాశి:
పెండింగ్‌లో ఉన్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి:
ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహ రాశి:
అధికారులతో మంచి సంబంధాలు ఏర్పర్చుకుంటారు. సమస్యలను అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.

కన్య రాశి:
అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. బంధువులతో విబేధాలు వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. మనసును ప్రశంతంగా ఉంచుకోవాలి.

తుల రాశి:
ముఖ్యమైన ఓ పనిని పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు.

వృశ్చిక రాశి:
చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గోసేవా చేయడం వల్ల మంచి జరుగుతుంది.

ధనుస్సు రాశి:
మీమీ రంగాలలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పనులను చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.

మకర రాశి:
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది.

కుంభ రాశి:
శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ధైర్యంతో ముందుగా సాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

మీన రాశి:
ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. పెద్దలను సంప్రదించి కీలక లావాదేవీలు చేయడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Tirupati: శ్రీవారికి అజ్ఞాత భక్తుడు భారీ విరాళం.. రూ. 3 కోట్లు విలువజేసే వరద-కఠి హస్తాల బహుకరణ

Chanakya Niti: మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే.. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..