Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. మార్చి 19 (శనివారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
- మేష రాశి: ఈ రాశివారు పని తీరుపై ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- వృషభ రాశి: ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అధికారులు మీ పనితీరు పట్ల కొంత అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది.
- మిథున రాశి: చేపట్టిన పనులలో చిన్నపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు మంచి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
- కర్కాటక రాశి: మీమీ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక వ్యవహారంలో ప్రశంసలు అందుకునే అవకాశం ఉంటుంది.
- సింహ రాశి: అభివృద్దికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తలెత్త అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
- కన్య రాశి: చేపట్టిన పనులలో మంచి లాభాలు ఉంటాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
- తుల రాశి: ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంతో ముందుకెళ్లడం వల్ల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి.
- వృశ్చిక రాశి: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివుడికి పూజలు చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ది చెందుతారు.
- ధనుస్సు రాశి: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా మంచి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
- మకర రాశి: పట్టుదలతో ముందుకెళితే అనుకున్న పనులు సాధిస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోవడం మంచిది. కొన్ని విషయాలు మిమ్మల్ని ఉత్సాహ పరుస్తాయి.
- కుంభ రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
- మీన రాశి: ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో శుభవార్తలు వింటారు.
ఇవి కూడా చదవండి: