Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోవద్దు..!

|

Jan 04, 2022 | 8:22 AM

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి..

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోవద్దు..!
Follow us on

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. జనవరి 4 (మంగళవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:
ఈ రాశివారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యంపై దృష్టి సారించాలి.

వృషభ రాశి:
ఈ రాశివారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. అరోగ్యం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిథున రాశి:
చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది. కొన్ని పనులు ప్రారంభించాలంటే చిత్తశుద్ది అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం.

కర్కాటక రాశి:
చేపట్టే పనులలో జాగ్రత్తగా ముందుకెళ్లాలి. సకాలంలో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు.

సంహ రాశి:
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. ఆర్థిక లాభాలు పొందుతారు. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

కన్య రాశి:
ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది.

తుల రాశి:
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో పాల్గొంటారు. పెద్దల నిర్ణయంతో ముందుకెళ్లడం మంచిది. కుటుంబ సభ్యుల పట్ల గౌరవంగా ఉండటం మంచిది.

వృశ్చిక రాశి:
మీమీ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులలో అధికారులను సంప్రదిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

ధనుస్సు రాశి:
వృత్తి, ఉద్యోగస్తులకు మంచి జరుగుతుంది. తోటి వారి నుంచి సహాయం అందుకుంటారు. ఆర్థిక లాభాలు పొందుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి:
దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కుంభ రాశి:
కీలక వ్యవహారాలలో ఆచీతూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. భవిస్యత్తు ప్రణాళిక వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

మీన రాశి:
ధైర్యంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. సమయానికి నిద్రించడం మంచిది. అధికంగా టెన్షన్‌కు గురికాకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Deadlines: వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్‌.. 2022లో చేసుకోవాల్సిన పనులు ఇవే.. గడువు దాటితే పెనాల్టీ..!

LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుందనే విషయం తెలుసా..? దానిని గుర్తించడం ఎలా..? పూర్తి వివరాలు