Horoscope Today: ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

May 23, 2022 | 6:16 AM

Today Horoscope: జీవితంలో కొన్నిసార్లు మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను (Horoscope) అనుసరించేవారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం (మే 23న ) రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us on

జీవితంలో కొన్నిసార్లు మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను (Horoscope) అనుసరించేవారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం (మే 23న ) రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషం: ఈ రాశివారి శ్రమ ఫలిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగడంతోపాటు పలువురి నుంచి ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి తగిన ఆర్థిక సహాయం అందుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభం: పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా.. నిర్ణయాలు తీసుకోవాలి.

మిథునం: ఈ రాశి వారికి మిశ్రమ కాలం. పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త ఉండాలి.

కర్కాటకం: ఈ రోజు శుభవార్త అందుకుంటారు. చేపట్టిన పనులను ఉత్సాహంతో పూర్తిచేస్తారు. గతంలో పూర్తికాని పని కూడా పూర్తవుతుంది. కుటుంబసభ్యులతో కాలాన్ని గడుపుతారు.

సింహం: ఈ రాశి వారికి ఒక సంఘటన మానసిక శక్తిని పెంచి సంతోషంగా ఉండేలా చేస్తుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి.

కన్య: ఈ రాశి వారికి శుభకాలం.. అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబసభ్యుల సూచనలు తీసుకోవడం మంచిది. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు.

తుల: ప్రారంభించిన పనులల్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సహకారం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబసభ్యులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు.

వృశ్చికం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త ఆనందాన్ని పెంచుతుంది. నూతన వస్తువులను కొంటారు. అవసరానికి తగిన ఆర్థిక సహాయం అందుతుంది.

ధనుస్సు: ఈ రాశి వారికి శుభకాలం.. ముఖ్యమైన వ్యవహారంలో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను అందుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. కొన్ని కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

మకరం: ఈ రాశి వారు తీసుకునే కీలక నిర్ణయం.. అందరినీ దృష్టిని ఆకట్టుకునేలా చేస్తుంది. అయితే.. నిర్ణయాలను తరచూ మార్చడం ఇబ్బందుల్లో పడేలా చేస్తుంది. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి.

కుంభం: ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవ్వడంతోపాటు శారీరక శ్రమ అధికమవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తగదు. కీలక విషయాల్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సూచనలు తీసుకోవడం మంచిది.

మీనం: ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. సకాలంలో పూర్తిచేస్తారు. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను అందరినీ ఆకట్టుకుంటాయి. కానీ ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబసభ్యుల నుంచి సహకారం అందుతుంది.