Horoscope Today (16-12-2021): రోజులో ఏమైనా పనులు మొదలు పెట్టేముందు మంచి, చెడులు గురించి ఆలోచిస్తారు కొంతమంది. తాము చేపట్టిన పనులు జరుగుతాయా.. ఆటంకాలు ఏర్పడతాయా అంటూ వెంటనే పంచాంగం వైపు దృష్టిసారిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలను చూడడనికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 16వ తేదీ ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు నిరుత్సాహంగా గడుపుతారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. స్థిరాస్థులకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధన నష్టానికి గురవుతారు. కుటుంబంలో అనుకొకుని లాభం ఏర్పడే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రుణబాధలు తీరతాయి. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు మానసిక ఆందోళనకు గురవుతారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కొత్తగా చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ కలహాలకు దూరమా ఉండడం మంచిది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగరంగలోని వారికీ పనులు ఆలస్యమవుతాయి.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టినపనులు ఫలిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకులంగా ఉంది. ఆకస్మిక ధన లాభం ఉంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి పనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. ఆకస్మికంగా ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు కుటుంబంలో కలతలు ఏర్పడతాయి. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం చేసే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధన నష్టం ఏర్పడి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. స్త్రీలు ఆనందంగా ఉంటారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివావారికీ చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడుతుంది. వృత్తి రీత్యా కొత్త సమస్యలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. కొంచెం నిరుత్సాహంగా రోజు గడుస్తుంది. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు అధికంగా ఉంటాయి.
మీన రాశి: ఈరోజు ఈరాశి వారు ఆకస్మిక ధననష్టాన్ని పొందుతారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్థిరాస్తివిషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా చేపట్టే పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కలహాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది.
Also Read: