Horoscope Today: ఈరాశులవారికి కొత్త ఉద్యోగాలు.. ఆర్థిక లాభాలు.. సోమవారం రాశిఫలాలు..

|

Sep 12, 2022 | 7:46 AM

వృత్తి, వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆర్థిక సమస్యలు ఇబ్బందిపెడతాయి.

Horoscope Today: ఈరాశులవారికి కొత్త ఉద్యోగాలు.. ఆర్థిక లాభాలు.. సోమవారం రాశిఫలాలు..
Horoscope
Follow us on

మేషరాశి..

ఈరోజు వీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త పనులు ప్రారంభంచకూడదు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆర్థిక సమస్యలు ఇబ్బందిపెడతాయి.

వృషభ రాశి..

ఈరోజు వీరికి అనుహ్యంగా స్నేహితుల సాయం అందుతుంది. అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగంలో చికాకులు ఉంటాయి.

మిథునరాశి..

వీరికి ఆస్తివివాదాలు తొలగిపోతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. దూర ప్రయణాలు చేస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు ఉంటాయి. అలాగే విందులు, వినోదాల్లో పాల్గోంటారు.

కర్కాటక రాశి.

ఈరోజు వీరు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగంలో.. వ్యాపారంలో సమస్యలు వస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం.

సింహరాశి..

ఈరోజు కొత్త పనులు ప్రారంభించకూడదు. బంధుమిత్రులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. దైవభక్తి పెరుగుతుంది. వ్యాపారంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి.

కన్య రాశి..

ఈరోజు వీరికి కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది.

తుల రాశి.

ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో కీర్తి, ప్రతిష్టలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరికి చేపట్టిన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువులు, మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరికి కుటుంబంలో ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. అనుకున్న పనులను వాయిదా వేస్తారు. ఇతరులతో ప్రవర్తనలో జాగ్రత్తలు అవసరం.

మకర రాశి..

ఈరోజు వీరు చేపట్టిన పనిని సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగాలు వ్సతాయి. వ్యాపారం, ఉద్యోగంలో సమస్యలు వస్తాయి.

కుంభ రాశి..

ఈరోజు వీరు చేపట్టిన పనులను తొందరగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగంలో పని భారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. బంధువులతో తగదాలు ఏర్పడతాయి.

మీనరాశి..

ఈరోజు వీరు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. వ్యాపారంలో ఆర్థికంగా లాభాలుంటాయి. చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేస్తారు.