సెప్టెంబర్ 4 రాశిఫలాలు: ఈ రాశులకు అదృష్టం తలుపు తడుతుంది.. మీ రాశికి ఇలా..
Horoscope Today (September 4, 2026): శుక్రవారం మేష రాశి వారికి ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనా, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఎదురుచూస్తున్న శుభవార్తలు అందడంతో పాటు కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఊహించని స్థాయిలో పదోన్నతి పొందే సూచనలు ఉన్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దిన ఫలాలు (సెప్టెంబర్ 4, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఊహించని స్థాయిలో పదోన్నతి కలిగే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనుకోని ఖర్చుల వల్ల ఒత్తిడికి గురవుతారు. వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. కొందరు మిత్రులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రముఖులతో పరిచ యాలు పెరుగుతాయి. మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలకు సమయం అను కూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఊహించని స్థాయిలో పదోన్నతి కలిగే సూచనలున్నాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మంచి కంపెనీల నుంచి ఆశించిన సమా చారం అందుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థికంగా అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కూడా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. బంధు మిత్రులకు సహాయం చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారం చేపడతారు. వృత్తి జీవితంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగు తుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో నిర్దేశించిన లక్ష్యాల్ని సాధిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరు గుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయ వృద్ధి సంబంధమైన ఏ ప్రయత్న మైనా అనుకూల ఫలితాలనిస్తుంది. కుటుంబానికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రయా ణాలు లాభిస్తాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ జీవితంలో ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆస్తి వివాదంలో ఆశించిన శుభవార్త అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయపరంగా కొద్దిపాటి అదృష్టం పడుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అధికార యోగా నికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి పురోగతి సాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపె ట్టినా తప్పకుండా సఫలమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూలస్పందన లభిస్తుంది. ఆదాయానికి లోటుండదు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో పెద్దగా లాభాలు ఉండకపోవచ్చు. భూమి సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు అంచ నాలకు మించి పురోగతి సాధిస్తారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఇతర విషయాల్లో తలదూర్చవద్దు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపో వచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా, సామరస్యంగా సాగిపోతుంది. ప్రయాణాలు పెట్టుకోవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ఆదరణ, గౌరవాభిమానాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సఫలమవుతాయి. ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.



