AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 25 రాశిఫలాలు: వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.. మానసిక ప్రశాంతత

Horoscope Today (September 25, 2026): శుక్రవారం 12 రాశుల వారికి గ్రహాల సంచారం ప్రభావంతో మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. మేష రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కుటుంబ ఖర్చులు అధికమయ్యే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి మానసిక ప్రశాంతత పొందవచ్చు. మిథున రాశి వారికి పని భారం, బాధ్యతలు పెరిగి ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 25 రాశిఫలాలు: వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.. మానసిక ప్రశాంతత
Rashi Phalalu 25 September 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 25, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 25, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ ఖర్చులు అదుపు తప్పుతాయి. వృషభ రాశి వారు చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మిథున రాశి వారు ఇంటా బయటా బరువు బాధ్యతలు, పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. రోజంతా చాలా వరకు హ్యాపీగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ ఖర్చులు అదుపు తప్పుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్య మైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో మాటకు విలువ పెరుగుతుంది. కొద్దిగా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. మీ సలహాల వల్ల బంధుమిత్రులు లాభపడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా నిలకడగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇంటా బయటా బరువు బాధ్యతలు, పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది. రావలసిన సొమ్ము సమయానికి అందకపోవచ్చు. బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. కుటుంబ జీవితం చాలావరకు అనుకూలంగా సాగుతుంది. కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. ఇష్టమైన మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

రావలసిన డబ్బు రాకపోవడంతో ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్య లుండే అవకాశం ఉంది. ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. వ్యాపారాల మీద మరింత శ్రద్ధ పెట్టడం అవ సరం. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిది. హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం పెట్టుకోవద్దు.

సింహం (మఖ, పుబ్బ, హస్త 1)

ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరత్రా రోజంతా చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గు తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి తేలికగా పరిష్కారమవు తుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మొండి బాకీలను పట్టుదలగా వసూలు చేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలి తాలుంటాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉచిత సహాయాలను వీలై నంత తగ్గించుకోవడం అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పురోగమిస్తాయి. వ్యాపా రాల్లో ఆశించిన అభివృద్ధికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించినంత పెరుగుదల ఉంటుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు జరిగిపోతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న సమాచారం అందు తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, బకాయిలు చేతికి అందుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంటా బయటా కొద్దిగా బాధ్యతల భారం తప్పకపోవచ్చు. కుటుంబ జీవితం హ్యాపీగా, హుషారుగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక సమ స్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన ప్రయత్నా లన్నీ నెరవేరుతాయి. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితుల్ని చాలావరకు చక్కబెడతారు. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. అను కోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యో గులకు ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. కొందరు బంధువులకు ఆర్థిక సహాయం చేసి ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు బాగా నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగపరంగా శుభ వార్తలు వింటారు. ఇంటా బయటా పనిభారం, మానసిక ఒత్తిడి ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితా లనిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమ స్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబంతో దైవకార్యాల్లో పాల్గొంటారు.

Follow Us