AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 11 రాశిఫలాలు: ఈ రాశులకు ఊహించని ధనలాభం.. మీ రాశి ఉందా?

Horoscope Today (September 11, 2026): శుక్రవారం 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. మేష రాశి వారికి వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉండటంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు రావాల్సిన బాకీలు చేతికి అందే అవకాశం ఉంది. మరి మేషం నుంచి మీనం వరకు మిగిలిన రాశుల వారికి శుక్రవారం నాటి దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

సెప్టెంబర్ 11 రాశిఫలాలు: ఈ రాశులకు ఊహించని ధనలాభం.. మీ రాశి ఉందా?
Horoscope Today 11 September 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 11, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 11, 2026): మేష రాశి వారికి వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా, సామరస్యంగా ముందుకు సాగుతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోతారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పడే అవ కాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. బంధుమిత్రు లతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్య మైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఆర్థికంగా కాస్తంత అభివృద్ధి ఉంటుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి చాలా జాగ్రత్తగా బయటపడతారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నిటినీ సానుకూలంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉన్నత వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. సామాజికంగా అనుకోని గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖు లతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది. ఆదాయా నికి ఇబ్బంది ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆదా యానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక సమ స్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఆధ్యా త్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఆశించిన స్థాయి పదోన్నతి లభిం చవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆదాయా నికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహ రిస్తే అంత మంచిది. పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. విదేశాల నుంచి శుభవార్త అందుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగు తుంది. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగానే నెరవేరుతాయి. ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో మంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరు గుతాయి. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడు తుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో విజ యాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం బాగా ప్రశాంతంగా సాగుతుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఇంటా బయటా మీ మాటకు బాగా విలువ ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు. ఆదాయానికి లోటుండదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక విషయాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చవుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబపరంగా కూడా కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగ స్వామికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

Disclaimer: ఈ రాశిఫలాలు జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న గ్రహాల సంచారం, సాధారణ జ్యోతిష్య అంచనాల ఆధారంగా అందించబడుతున్నాయి. ఇవి వ్యక్తిగత జాతక ఫలితాలకు ప్రత్యామ్నాయం కావు. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, భుక్తులు తదితర అంశాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు

Follow Us