AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: బుధుడితో చంద్రుడి యుతి.. వారి ప్రయత్నం సక్సెస్ కావడం పక్కా..!

సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు కన్యా రాశిలో చంద్రుడు, ఉచ్ఛ స్థితిలో ఉన్న బుధుడితో యుతి ఏర్పడనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ చంద్ర–బుధ కలయిక విజయాలు, సాఫల్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ మూడు రోజుల్లో కొత్త ప్రయత్నాలు ప్రారంభించే వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి పురోభివృద్ధికి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో చేపట్టిన ప్రయత్నాలు సెప్టెంబర్ 23లోగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.

Astrology: బుధుడితో చంద్రుడి యుతి.. వారి ప్రయత్నం సక్సెస్ కావడం పక్కా..!
Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 09, 2026 | 7:29 PM

Share

తండ్రీ కుమారులైన చంద్ర, బుధులు ఎక్కడ కలిసినా కొన్ని రాశులకు శుభ ఫలితాలనివ్వకుండా ఉండరని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రెండు గ్రహాల కలయిక విజయాలకు, సాఫల్యాలకు ప్రతీక. అందులోనూ చంద్రుడు గానీ, బుధుడు గానీ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు మరింత యోగ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఈ నెల(సెప్టెంబర్) 11, 12, 13 తేదీల్లో కన్యారాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న బుధుడితో చంద్రుడి యుతి జరుగుతోంది. ఈ మూడు రోజుల్లో ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా ఈ నెల 23వ తేదీలోగా సక్సెస్ అవుతుంది. వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు తమ పురోభివృద్ధికి సంబంధించి ఏదైనా ప్రయత్నం చేయడం మంచిది.

వృషభం

ఈ రాశికి పంచమ స్థానంలో బుధ, చంద్రుల కలయిక వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. గృహ, ఆస్తి సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా నూరు శాతం విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సంతాన యోగం కలుగుతుంది.

మిథునం

రాశ్యధిపతి బుధుడు ధనాధిపతి చంద్రుడితో చతుర్థ స్థానంలో కలవడం వల్ల ఆస్తి వివాదం అను కూలంగా పరిష్కారమవుతుంది. సొంత ఇంటికి ప్రయత్నించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించిన లాభాలనిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. షేర్లు బాగా లాభిస్తాయి.

కన్య

రాశ్యధిపతి బుధుడితో లాభాధిపతి చంద్రుడు యుతి చెందడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ఊహించని లాభాలనిస్తాయి. ఉద్యోగంలో పదోన్న తితో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించు తాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది.

వృశ్చికం

ఈ రాశికి భాగ్య స్థానాధిపతి చంద్రుడికి, లాభ స్థానాధిపతి బుధుడికి యుతి జరగడం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆదాయ వృద్ధికి గట్టి ప్రయత్నాలు సాగించడం మంచిది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. తండ్రి నుంచి సంపద కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు వేతనాలు బాగా వృద్ధి చెందుతాయి.

మకరం

ఈ రాశికి భాగ్య స్థానంలో సప్తమ, భాగ్యాధిపతుల మధ్య యుతి జరగడం వల్ల విదేశీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.

మీనం

ఈ రాశికి పంచమ, సప్తమాధిపతులైన చంద్ర, బుధుల మధ్య కలయిక జరగడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యో గులకు విదేశీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు చెందిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో సక్సెస్ అవుతారు.

Follow Us
ప్రకృతి మధ్య థ్రిల్.. ఆకాశంలో సాహసం!
ప్రకృతి మధ్య థ్రిల్.. ఆకాశంలో సాహసం!
బుధుడితో చంద్రుడి యుతి.. వారి ప్రయత్నం సక్సెస్ కావడం పక్కా..!
బుధుడితో చంద్రుడి యుతి.. వారి ప్రయత్నం సక్సెస్ కావడం పక్కా..!
ఇకపై ఇడ్లీలు అస్సలు అంటుకోవు.. మీకు ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే..
ఇకపై ఇడ్లీలు అస్సలు అంటుకోవు.. మీకు ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే..
పులుల కొత్త వలస బాట.. 14 ఏళ్ల కవ్వాల్ నిరీక్షణ ఫలించేనా?
పులుల కొత్త వలస బాట.. 14 ఏళ్ల కవ్వాల్ నిరీక్షణ ఫలించేనా?
చాలా తక్కువ మందికి తెలిసిన ఘుమఘుమలాడే సొరకాయ వేపుడు
చాలా తక్కువ మందికి తెలిసిన ఘుమఘుమలాడే సొరకాయ వేపుడు
'పిఠాపురంలో' ఏం జరిగింది? రాజేంద్రప్రసాద్ సినిమా రిలీజ్ డేట్ ఇదే
'పిఠాపురంలో' ఏం జరిగింది? రాజేంద్రప్రసాద్ సినిమా రిలీజ్ డేట్ ఇదే
ఇంట్లో వినాయకుడి తొండం ఏ వైపు ఉండాలి? ఆ దిశగా ఉంటే అశుభమా?
ఇంట్లో వినాయకుడి తొండం ఏ వైపు ఉండాలి? ఆ దిశగా ఉంటే అశుభమా?
పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి
పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి
ఆ హీరోయిన్‌ నాకు అక్కలాంటిది.. ఆమె అకాల మరణం చాలా బాధేసింది
ఆ హీరోయిన్‌ నాకు అక్కలాంటిది.. ఆమె అకాల మరణం చాలా బాధేసింది
ట్రంప్‌లో ఊహించని కొత్త యాంగిల్.. స్టాఫ్ కు నజరానా !
ట్రంప్‌లో ఊహించని కొత్త యాంగిల్.. స్టాఫ్ కు నజరానా !