AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు 27 రాశిఫలాలు: ఆ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వ్యాపారంలో లాభాలు

ఆగస్టు 27, 2026 గురువారం రోజున మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగంలో సమస్యల పరిష్కారం కనిపిస్తోంది. వృషభ రాశి వారికి ఆకస్మిక స్థానచలనం సూచనలు ఉండగా.. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల ఆదరణ, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఆగస్టు 27 రాశిఫలాలు: ఆ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వ్యాపారంలో లాభాలు
Horoscope Today 27 August 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 27, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (ఆగస్టు 27, 2026): మేష రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. దగ్గర బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. నూతన ఉద్యో గావకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు, పనులు సజావుగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కొన్ని ముఖ్య మైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. బంధువర్గం నుంచి ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులుం టాయి. స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో ఆటంకాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొం టారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలుంటాయి. కుటుంబ విష యాల్లో కొద్దిగా సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పెడతాయి. రుణ సంబంధమైన ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగి పోతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవి తం అనుకూలంగా సాగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి అరుదైన ఆఫర్లు అందుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, హుషారుగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. భూ క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభాలనిస్తాయి. బంధువుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి ఢోకా లేదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింతగా లాభాలు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కీలక సమయంలో అధికారులకు మీ సలహాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇంటా బయటా ఏ పని చేపట్టినా శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, మొండి బాకీలు వసూలవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా మారుతుంది. కుటుంబ జీవితం ఆశించిన స్థాయిలో మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఇంటా బయటా పరిస్థితులు బాగాఅను కూలంగా ఉంటాయి. బంధుమిత్రులకు వీలైనంతగా సాయం చేయడం జరుగుతుంది. నిరుద్యోగు లకు కార్యసిద్ధి లభిస్తుంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం పెట్టుకోవద్దు.ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రయాణాల్లో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. బంధుమిత్రుల నుంచి రావాల్సిన డబ్బు అందుతుంది. ఒకరిద్దరు మిత్రుల వల్ల ఇరకాట పరిస్థితులు ఏర్పడతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహా రాల్లో ఒత్తిడి, చికాకులుంటాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణ సమస్యలు తగ్గుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో మైత్రి పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగం మారే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. చేపట్టిన వ్యవహారాలను సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. ఆదాయం వృద్ధి చెందు తుంది. మిత్రుల వల్ల డబ్బు వృథా అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి బాగా తగ్గిపోతాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి సరికొత్త అవ కాశాలు అందుతాయి. వ్యాపారాల్లో చిన్నా చితకా ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆత్మీ యులతో కొద్దిపాటి విభేదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. మిత్రుల సాయంతో పెండింగు పనులు సానుకూలపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో స్థాన చలన సూచనలున్నాయి. బాధ్యతల్లో మార్పులు కలుగుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశిం చిన ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది. గౌరవాలకు లోటుండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ బాధ్యతలు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఎవరితోనూ ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. మోసపోయే అవకాశం ఉంది. కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ పెండింగ్ పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖు లతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు.

Follow Us