AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Gochar: తులా రాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి భోగభాగ్యాలు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Shukra Gochar 2026: సెప్టెంబర్ 3న తులా రాశిలోకి ప్రవేశించే శుక్రుడు జనవరి 2 వరకు సుమారు 112 రోజుల పాటు ఇదే రాశిలో సంచరించనున్నాడు. శుక్రుడి ఈ అరుదైన స్వక్షేత్ర సంచారం వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం, మహా భాగ్య యోగం వంటి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

Shukra Gochar: తులా రాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి భోగభాగ్యాలు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
Venus Transit In Libra
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 26, 2026 | 4:51 PM

Share

సెప్టెంబర్ 3న తన స్వస్థానమైన తులా రాశిలో ప్రవేశిస్తున్న శుక్రుడు సుదీర్ఘకాలం ఇందులోనే సంచారం చేయడం జరుగుతోంది. సాధారణంగా నెల రోజులకు మించి ఏ రాశిలోనూ సంచారం చేయని శుక్రుడు ఏకంగా జనవరి 2 వరకు సుమారు 112 రోజుల పాటు తన స్వస్థానంలో సంచారం చేయడం అరుదైన విషయం. సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడి స్వక్షేత్ర సంచారం వల్ల నాలుగు రాశుల వారికి విశేషమైన మాలవ్య మహాపురుష యోగం, రెండు రాశులకు మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారు ఈ యోగాలను పొందడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్ప డుతోంది. దీనివల్ల అధికార యోగం పట్టడం, సంపద బాగా వృద్ధి చెందడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వంటివి జరిగి ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం కలుగుతుంది. సంపన్నులు లేదా పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి నిశ్చయం కావడం గానీ జరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడి స్వక్షేత్ర సంచారం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా హోదా, స్థాయి వృద్ధి చెందు తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు బాగా విస్తరిస్తాయి. స్వయంగా ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. సంపద బాగా పెరుగుతుంది.
  3. కన్య: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి శుక్రుడి సంచారం వల్ల మహా భాగ్య యోగం పట్టింది. దీనివల్ల అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా సఫలమ వుతుంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. జీవిత భాగస్వామికి అదృష్టాలు పడతాయి. కుటుంబ జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  4. తుల: ఈ రాశి అధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం ప్రారంభించినందువల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఒక ప్రము ఖుడుగా గుర్తింపు పొందడం కావడం జరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. రాజకీయ ప్రముఖులు, అపర కుబేరులు, వాణిజ్యవేత్తలు తదితర ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి శుక్రుడి సంచారం వల్ల మహా భాగ్య యోగం కలిగింది. జీవి తం కొత్త మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా అనేక వైపుల నుంచి ఆర్థిక లాభాలు, ఆదాయ వృద్ధి కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి బయటపడతాయి.
  7. మకరం: ఈ రాశికి దశమ కేంద్రంలో దశమాధిపతి శుక్రుడి సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం కలిగింది. కెరీర్ పరంగా అనేక శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి.

(గమనిక: ఈ కథనంలోని సమాచారం జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాలు, అంచనాల ఆధారంగా అందించబడింది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకులు తమ వ్యక్తిగత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ సమాచారాన్ని కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే చూడాలి)

Follow Us