రవి మీద శని దృష్టి.. వారికి ఆకస్మిక ధనలాభం, తిరుగులేని రాజయోగాలు..!

Telugu Astrology: రవి–శని గ్రహాల దృష్టి సాధారణంగా కఠిన ఫలితాలను ఇస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతున్నా, ఈసారి కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న రవిపై మీన రాశిలోని శని తృతీయ దృష్టి పడటం వల్ల వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి జూన్ 16 వరకు రాజయోగ ప్రభావం కనిపించనుంది. ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ రంగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

రవి మీద శని దృష్టి.. వారికి ఆకస్మిక ధనలాభం, తిరుగులేని రాజయోగాలు..!
Lucky Zodiac Signs

Edited By:

Updated on: May 22, 2026 | 6:39 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి, శనులు తండ్రీ కుమారులు. అయితే, ఈ రెండు గ్రహాలు బద్ధ శత్రువులు. ఇవి రెండూ కలిసి ఉన్నా, పరస్పర దృష్టి కలిగి ఉన్నా జీవితంలో ఉత్పాతాలు చోటు చేసుకుంటాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న రవిని శని మీన రాశి నుంచి తృతీయ దృష్టితో వీక్షించడం జరుగుతోంది. ఇది పరస్పర దృష్టి కానప్పటికీ, శని దృష్టి కొన్ని రాశులకు ఏమంత మంచిది కాదనే చెప్పాలి. అయితే, కొన్ని రాశులకు మాత్రం ఇవి రాజయోగాలను కలిగిస్తాయి. జూన్ 16 వరకు ఈ దృష్టి కొనసాగుతుంది. వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు రాజయోగం కలుగుతుంది.

  1. వృషభం: ఈ రాశిలో ఉన్న రవి మీద శని దృష్టి వల్ల ఈ రాశివారికి రాజయోగంతో పాటు ధనయోగం కూడా కలిగింది. దీనివల్ల చిన్న ఉద్యోగికి సైతం అధికార యోగం పట్టడం జరుగుతుంది. అనేక విధాలుగా సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ తాయి. రాజకీయాల్లో, ప్రభుత్వంలో ఉన్నవారు అందలాలు ఎక్కుతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నవారు తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు.
  2. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న శని లాభ స్థానంలో ఉన్న రవిని వీక్షించడం వల్ల ఇంట్లోకి అన్ని వైపుల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. తండ్రి నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో జీతాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి.
  3. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న శని భాగ్య స్థానంలో ఉన్న రవిని చూడడం వల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం వల్ల లాభం ఉంటుంది. రాజకీయాలు, ప్రభుత్వంలో ఉన్నవారికి రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. మదుపులు, పెట్టుబడులు బాగా లాభిస్తాయి.
  4. వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న శని సప్తమ స్థానంలో ఉన్న రవిని వీక్షించడం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. ఒక సంస్థలో సర్వాధికారిగా పదవిని చేపట్టడం జరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పూర్తి అనుకూలంగా పరిష్కారం అవుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: రాశ్యధిపతి శని పంచమంలో ఉన్న రవిని వీక్షించడం వల్ల ఈ రాశివారికి అకస్మాత్తుగా దశ తిరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఏ రంగంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. జీవనశైలి మారిపోతుంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు పెంపొందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
  7. మీనం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శని తృతీయంలో ఉన్న రవిని చూడడం వల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగం కలుగుతుంది. అధికార యోగం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. సొంత ఇంటి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వాహన యోగం పడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, వాస్తు, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us