Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించిన అమర వీరుల స్ఫూర్తి మరువలేనిది"- కేంద్ర సహాయక హోంమంత్రి జి.కిషన్ రెడ్డి
  • చెన్నై : తమిళనాడు లో రుతుపవనాల ప్రభావం తో భారీ గా కురుస్తున్న వర్షాలు . తిరువళ్లూరు,కాంచీపురం జిల్లాలతో పాటు వెల్లూర్ ,విరుదునగర్,నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . పలు చోట్ల రోడ్లన్నీ జలమయం ,ఉరుములు తో కూడిన వర్షాలకు పలు చోట్ల నేలకొరిగిన చెట్లు . తిరువళ్లూరు జిల్లాలో పిడుగుపాటు కి ఒక మహిళ మృతి.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • ఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయంలో కరోనా పాజిటివ్. దాదాపు 13 మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

లాక్‌డౌన్ ఎఫెక్ట్: పెరిగిన సైబర్ నేరాలు..!

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. చాలా
Cyber Attack, లాక్‌డౌన్ ఎఫెక్ట్: పెరిగిన సైబర్ నేరాలు..!

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సౌలభ్యం కల్పించాయి. సైబర్ నేరగాళ్లకు ఇప్పుడిది వరంగా మారింది. ఇంటి నుంచి పనిచేస్తున్న ఓ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు జూమ్ యాప్ ద్వారా మేనేజ్‌మెంట్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లోకి వచ్చాడు. మీటింగ్ ప్రారంభమైన కాసేపటికే స్క్రీన్ హ్యాక్ అయింది. స్క్రీన్‌పై అశ్లీల దృశ్యాలు ప్లే అవడం ప్రారంభమైంది. దీంతో మీటింగ్‌లో ఉన్న అందరూ ఒక్కసారిగా కాల్స్ కట్ చేశారు.

కాగా.. కోవిద్ 19 ‌పై పోరుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, విరాళాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల దేశ ప్రజలను కోరారు. ఆయన అలా అన్నారో, లేదో పీఎంకేర్స్ పేరుతో వందలాది ఫేక్ యూపీఐలు పుట్టుకొచ్చాయి. అవి ఫేక్ ఐడీలని తెలుసుకునే లోపే సైబర్ నేరగాళ్లు కోట్లాది రూపాయలు దండుకున్నారు. హోం నెట్‌వర్క్‌లు చాలా బలహీనంగా ఉండడంతో సైబర్ దాడులకు ఇవి ఎక్కువగా గురవుతుంటాయి. మీ సమీపంలో కరోనా వైరస్‌తో బాధపడుతున్నవారి గురించి తెలియజేస్తామని, కోవిడ్-19 హీట్‌మ్యాప్స్ అందిస్తామంటూ డజన్ల కొద్దీ మెసేజ్‌, వెబ్‌సైట్లు వస్తున్నాయి. వీటిని నమ్మి క్లిక్ చేస్తే ఇక పని అయిపోయినట్టే. ఇలాంటి వన్నీ చివరికి హ్యాకింగ్‌తో ముగుస్తాయి.

Also Read: నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న చికెన్ ధరలు..

 

Related Tags