లాక్ డౌన్ ఎఫెక్ట్.. తిండి కోసం విష సర్పాన్ని చంపి….

లాక్ డౌన్ కారణంగా ఆహరం లేక అనేకమంది పేదలు అల్లాడుతున్నారు. పట్టెడన్నం కోసం అలమటిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఆకలికి తాళలేక ముగ్గురు వ్యక్తులు అడవుల్లోకి వెళ్లారు. కొంత దూరం వెళ్లేసరికి 12 అడుగుల కోబ్రా కనబడగానే ఒడుపుగా దాన్ని పట్టుకుని అక్కడికక్కడే చంపేశారు.. ఇక దానితో వంట సిధ్ధం చేసుకున్నారట.. కొన్ని రోజులుగా తాము  మాంసాహారమే తినలేదని, ఇప్పుడు దీనితో ‘విందు’ చేసుకుంటామని ఆ ముగ్గురిలో ఒకడు చెప్పాడు. తాము చంపిన పామును భుజాలమీద వేసుకుని […]

లాక్ డౌన్ ఎఫెక్ట్.. తిండి కోసం విష సర్పాన్ని చంపి....
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 20, 2020 | 7:10 PM

లాక్ డౌన్ కారణంగా ఆహరం లేక అనేకమంది పేదలు అల్లాడుతున్నారు. పట్టెడన్నం కోసం అలమటిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఆకలికి తాళలేక ముగ్గురు వ్యక్తులు అడవుల్లోకి వెళ్లారు. కొంత దూరం వెళ్లేసరికి 12 అడుగుల కోబ్రా కనబడగానే ఒడుపుగా దాన్ని పట్టుకుని అక్కడికక్కడే చంపేశారు.. ఇక దానితో వంట సిధ్ధం చేసుకున్నారట.. కొన్ని రోజులుగా తాము  మాంసాహారమే తినలేదని, ఇప్పుడు దీనితో ‘విందు’ చేసుకుంటామని ఆ ముగ్గురిలో ఒకడు చెప్పాడు. తాము చంపిన పామును భుజాలమీద వేసుకుని వీళ్ళు పోజులిచ్చారు. అయితే అరుదైన జాతికి చెందిన జంతువులు,  సర్పాల వంటి వాటిని చంపడం నేరం. అందువల్ల పోలీసులు వీరిపై కేసు పెట్టారు. కాగా.. ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో బియ్యానికి కొరత లేదని, మూడు నెలలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని, పేదలకు తాము ఉచితంగా  రేషన్ ఇస్తున్నామని చెబుతోంది.

a,