అత్యంత విషమంగా జైట్లీ ఆరోగ్యం..

Several leaders visit AIIMS to enquire about Arun Jaitley's health, అత్యంత విషమంగా జైట్లీ ఆరోగ్యం..

కేంద్ర మాజీ ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారినట్లు తెలుస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తదితరులు ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎక్మో, ఐఏబీపీ సాయంతో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గుండె, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీని ఈనెల 9న ఎయిమ్స్‌లో చేర్పించారు. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. కాసేపట్లో ఆయనకు డయాలసిస్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *