నేడే ఏపీలో ఇంటర్ ఫలితాలు.. చూసుకోండిలా..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ మొదట, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు...

నేడే ఏపీలో ఇంటర్ ఫలితాలు.. చూసుకోండిలా..
Follow us

|

Updated on: Jun 12, 2020 | 12:55 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సంయుక్తంగా ఇంటర్ మొదట, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం రద్దు అయినందున ఫస్ట్ ఇయర్ ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కుల రూపంలో ప్రకటించనున్నారు.

అయితే సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మాత్రం గ్రేడ్లను ప్రకటిస్తారు. విద్యార్ధులు మార్క్స్ మెమోస్‌ను జూన్ 15 నుంచి ఏపీ ఇంటర్ బోర్డు అఫీషియల్ వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇంటర్ ఫలితాలను https://bie.ap.gov.in, manabadi.co.in, manabadi.com, schools9.com, examsresults.net వంటి వెబ్‌సైట్లలో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి విద్యార్ధులు తెలుసుకోవచ్చు. కాగా, ఏపీలో లాక్ డౌన్ ముందు మార్చి 4 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి విదితమే.

Also Read:

గుడ్ న్యూస్.. ఇకపై మూడు రోజుల్లోనే పెన్షన్ విత్ డ్రా..

మహిళల కోసం మరో సంక్షేమ పధకం.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!

బీటెక్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సప్లిమెంటరీలో పాసైనా రెగ్యులరే.!