Breaking News
  • దేశవ్యాప్తంగా 121 మంది దర్యాప్తు అధికారులకు కేంద్ర హోంమంత్రి పతకాలు. దర్యాప్తులో ప్రతిభ చూపిన కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులకు పతకాలను ప్రకటించిన కేంద్రం. సీబీఐ హైదరాబాద్ ఎస్పీ కళ్యాణ్ కు కేంద్ర హోంమంత్రి పతకం.
  • సంజ‌య్ ద‌త్ ఆరోగ్యం గురించి స్పందించిన భార్య మాన్య‌తా ద‌త్‌: భ‌గ‌వంతుడు మ‌రోసారి ప‌రీక్షిస్తున్నాడ‌ని వెల్ల‌డి. ఓర్చుకుంటే ఈ క‌ష్ట‌కాలాన్ని దాట వ‌చ్చ‌ని ధీమా. సంజ‌య్‌దత్ క్షేమాన్ని కోరుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. అన‌వ‌స‌ర‌మైన రూమ‌ర్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరిన మాన్య‌త‌. సంజ‌య్ ఫైట‌ర్ అని కితాబిచ్చిన మాన్య‌త‌. అంద‌రి ప్రార్థ‌న‌లు, ఆశీర్వాదాలు కావాల‌న్న మాన్య‌త‌. పాజిటివిటీని పంచాల‌ని కోరిన మాన్య‌త.
  • విజయవాడ: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ap ప్రభిత్వం ఉత్తర్వులు. హౌస్ సర్జన్, పిజి డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు పెంపు. ఎంబీబీఎస్ విద్యార్థులకు 19,589. పిజి డిగ్రీ విద్యార్థులకు 1 ఇయర్ 44,075, 2 ఇయర్ 46,524, 3 ఇయర్ 48, 973 కు పెంపు.
  • ఉత్తరాఖండ్‌కు పొంచి ఉన్న వర్షాలు, వరదల ముప్పు. భారీ వర్షసూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరిక. భాగేశ్వర్, పిత్తోరాగఢ్, నైనితాల్, ఉద్ధమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్, హరిద్వార్, చమోలీ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం.
  • మణికొండ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ సమీపం లో కార్ ఆక్సిడెంట్. జబర్దస్త్ ఆర్టిస్ట్ అభి bmw కార్ మరో కారు బ్రిజా కార్ ఢీ. బ్రిజా కారును అతివేగంగా అభి ఢీ కొట్టినట్టు ఆరోపిస్తున్న బాధితుడు.
  • హైదరాబాద్ లో థీమ్ పార్కు ల నిర్మాణానికి శంకుస్థాపన . డిల్లీ , పూణె లో తరహాలో సీటీలో ఆరు చోట్ల థీమ్ పార్క్ లు . 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిహెచ్ఎంసి . మూడు నెలలో పార్క్ ల నిర్మాణం పూర్తి చేస్తాం: జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్.
  • చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా జాగర్‌గుండా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్. కోబ్రా 223, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల జాయింట్ ఆపరేషన్. నలుగురు మావోయిస్టులు హతం, మారణాయుధాలు స్వాధీనం.

Breaking: ఏపీలో క్వారంటైన్‌ విధానంలో మార్పులు

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి క్వారంటైన్ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్‌ని 7 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.
Quarantine system in Andhra Pradesh, Breaking: ఏపీలో క్వారంటైన్‌ విధానంలో మార్పులు

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి క్వారంటైన్ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్‌ని 7 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. వారికి 5వ రోజు, 7 రోజున కరోనా టెస్ట్‌లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానంలో వచ్చే వారికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాలని, విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేయాలని ప్రభుత్వం సూచించింది. వారికి 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలని వెల్లడించింది. ఇక రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే వారిలోనూ ర్యాండమ్‌గా టెస్టులు చేయాలని.. వారికి 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేయాలని తెలిపింది.

రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రంలోకి వచ్చే వారి కోసం బోర్డర్ చెక్ పోస్టుల వద్దే స్వాబ్ టెస్టులు చేయాలని వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా  ఈ-పాస్‌కి దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను తక్షణమే కరోనా ఆస్పత్రులకు తరలించాలని సూచించింది. హోమ్ క్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికల కోసం ఏఎన్ఎంలు, గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌. జవహర్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ఉత్తర్వుల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్‌ ప్రాంతాలుగా ప్రకటించింది ప్రభుత్వం.

Related Tags