శ్రీకాకుళంలో సీఎం జగన్ టూర్.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

AP CM YS Jagan Mohan Reddy to visit Srikakulam district today, శ్రీకాకుళంలో సీఎం జగన్ టూర్.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారు. పలాస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, వజ్రపుకొత్తూరు మండలాల్లో పర్యటించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలోని హెలీప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ అవ్వనున్నారు. అపనంతరం అక్కడి నుంచి 2 కిలోమీటర్లు భారీ ర్యాలీతో సభా వేదిక వద్దకు సీఎం జగన్ చేరుకోనున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రం, రూ.600 కోట్లతో నిర్మించనున్న సమగ్ర నీటి పథకం, నువ్వలరేవు-మంచినీళ్లపేట గ్రామాల మధ్య రూ.11.95 కోట్లతో నిర్మించనున్న ఫిషింగ్‌ జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

సీఎం జగన్ పర్యటన దృష్ట్యా అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవలే జిల్లాలో మావోయిస్టుల డంప్‌ లభ్యం కావడం… ప్రశాంతంగా ఉన్న జిల్లాలో మావోయిస్టుల అలజడి ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం ఎస్పీల ఆధ్వర్యంలో భద్రత పర్యవేక్షణ చేపడుతున్నారు.ఇద్దరు అదనపు ఎస్పీలు, 14 మంది డీఎస్పీల ఆధ్వర్యంలో పోలీసు బలగాలు భద్రత చేపట్టనున్నారు. అలాగే స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం కూడా సీఎం పర్యటన ప్రారంభం నుంచి ముగిసేంతవరకు భద్రత కొనసాగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *