Anushka Shetty : ఫ్లాప్ డైరెక్టర్ తో స్టార్ హీరోయిన్ సినిమా.. అనుష్క మరో రిస్క్ చేస్తుందా..

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి నిశబ్దం సినిమా తర్వాత కొత్త సినిమాలను అధికారికంగా ప్రకటించింది లేదు. నిశబ్దం సినిమా కు కూడా అనుష్క చాలా గ్యాప్ తీసుకుంది. అనుష్క తమిళ కన్నడ సినిమాలు కూడా చేసింది

Anushka Shetty : ఫ్లాప్ డైరెక్టర్ తో స్టార్ హీరోయిన్ సినిమా.. అనుష్క మరో రిస్క్ చేస్తుందా..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 5:39 AM

Anushka Shetty : టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి నిశబ్దం సినిమా తర్వాత కొత్త సినిమాలను అధికారికంగా ప్రకటించింది లేదు. నిశబ్దం సినిమా కు కూడా అనుష్క చాలా గ్యాప్ తీసుకుంది. అనుష్క తమిళ కన్నడ సినిమాలు కూడా చేసింది కానీ తెలుగులోనే స్టార్ హీరోయిన్ హోదాలో స్థిరపడిపోయింది. అటు గ్లామర్ పరంగాను ఇటు అభినయం పరంగాను కొన్నేళ్లపాటురాణించింది ఈ ముద్దుగుమ్మ. నిశ్శబ్దం ఫెయిల్యూర్ తో స్వీటీ సోలోగా భారీ హిట్టు కొట్టాలని ప్రయత్నాలు చేస్తుంది.

బాహుబలితో ఓ రేంజ్ గుర్తింపు వచ్చిన తర్వాత.. మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తోంది స్వీటీ. తాజాగా ప్రభాస్ హోం బ్యానర్ గా పేరున్న యూవీ క్రియేషన్స్ లో అనుష్క సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. సందీప్ కిషన్ నటించిన ‘రారా కృష్ణయ్య’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పి మహేష్‌ దర్శకత్వంలో అనుష్క మూవీ ఉంటుందని అంటున్నారు. మహేష్ ఇప్పటికే అనుష్కకి ఒక స్క్రిప్ట్ వినిపించాడట. ఆ స్క్రిప్ట్ కూడా అనుష్కకు బాగా నచ్చిందని.. ఇక త్వరలో అఫీషియల్ గా సినిమాను అనౌన్స్ చేసే అవకాశలు ఉన్నాయని సమాచారం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మరో సినిమాను అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. టైటిల్ లోగో పోస్టర్‏ను విడుదల చేసిన చిత్రయూనిట్..