ప్రేమ పేరుతో దారుణం.. బస్సులో నుంచి దింపి పొలాల్లోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యం..!

కృష్ణా జిల్లాలో ప్రేమ పేరుతో ఓ యువతిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి, అవనిగడ్డకు చెందిన సందీప్ అనే యువకుడితో గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉంది. అయితే ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను ప్రేమించాలని యువతి వెంట సందీప్ తరచూ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ప్రేమ పేరుతో దారుణం.. బస్సులో నుంచి దింపి పొలాల్లోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యం..!
Love Attack

Updated on: Aug 06, 2026 | 1:11 PM

కృష్ణా జిల్లాలో ప్రేమ పేరుతో ఓ యువతిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి, అవనిగడ్డకు చెందిన సందీప్ అనే యువకుడితో గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉంది. అయితే ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను ప్రేమించాలని యువతి వెంట సందీప్ తరచూ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఆగస్టు నెల 2వ తేదీన యువతి చల్లపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి బస్సులో తిరిగి వస్తుంది. మార్గమధ్యంలో సందీప్ బస్సును ఆపించి ఆమెను కిందకు దింపి తీసుకెళ్లాడు. అనంతరం తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని మోపిదేవి సమీపంలోని పొలాల వద్దకు తీసుకెళ్లి దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

దాడిలో గాయపడిన యువతిని స్థానికులు, కుటుంబ సభ్యులు అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మోపిదేవి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన పరిస్థితులు, దాడికి దారితీసిన కారణాలు, నిందితుడి కదలికలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు, దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us