AP Weather: ఏపీలో బలమైన గాలులతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

ఏపీలో వర్షాలు కొనసాగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

AP Weather: ఏపీలో బలమైన గాలులతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Andhra Weather Report
Follow us

|

Updated on: Jul 06, 2024 | 1:30 PM

నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతము, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి సగటున 5.8 & 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించింది. ఇక రుతుపవనాలు కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

శనివారం, ఆదివారం ;- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

సోమవారం ;- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

శనివారం ;- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో కొన్ని చోట్ల వీచే అవకాశముంది.

ఆదివారం;- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు… బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది .

సోమవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది

రాయలసీమ :-

శనివారం, ఆదివారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు.. బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

సోమవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..