Andhra News: ఎలా వస్తున్నాయ్‌రా ఇలాంటి ఐడీయాలు.. లవర్స్‌ను చంపి ఏం చేశాడో తెలిస్తే..

విశాఖ జిల్లాలో దారుణం ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ఓ సూట్‌కేస్‌లో కుక్కి పక్కరాష్ట్రానికి తీసుకెళ్లి మరీ పడేశాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం తెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News: ఎలా వస్తున్నాయ్‌రా ఇలాంటి ఐడీయాలు.. లవర్స్‌ను చంపి ఏం చేశాడో తెలిస్తే..
Vizag Suitcase Murder Case Solved

Updated on: Jul 31, 2026 | 9:21 AM

విశాఖ జిల్లాలో దారుణం ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ఓ సూట్‌కేస్‌లో కుక్కి పక్కరాష్ట్రానికి తీసుకెళ్లి పడేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం కంచరపాలెం దుర్గానగర్‌కు చెందిన బోలిశెట్టి సురేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే తన భార్య గర్భిణీ కావడంతో ఆమెకు సహాయంగా ఉండేందుకని తనకు పరిచమైన ఓ యువతిని ఇంటికి రప్పించుకున్నాడు సురేష్‌.. ఆమె వారితో కలిసి ఇంట్లోనే ఉండేంది. ఈ క్రమంలోనే సదురు యువతితో సురేష్‌కు వివాహేతర బంధం ఏర్పడింది.

అయితే ఇటీవల సురేష్ భార్య పుట్టింటికి వెళ్లడంతో, సదరు యువతి తనను పెళ్లి చేసుకోవాలంటూ సురేష్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.దీంతో ఆగ్రహానికి గురైన సురేష్ ఆ యువతిని గోడకేసి బాది, కొట్టి హత్య చేశాడు. అనంతరం ఆధారాలను మాయం చేసేందుకు ఆమె మృతదేహాన్ని ఒక సూట్‌కేస్‌లో కుక్కి ఎవరికీ అనుమానం రాకుండా ఆ సూట్‌కేస్‌ను రైలులో ఒడిశాకు తీసుకెళ్లాడు. రాయగడ జిల్లా చాందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి తిరిగి వచ్చేశాడు.

అయితే నిర్మానుష్య ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న సూట్‌కేస్‌లో యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఒడిశా పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆధారాల కోసం కూపీ లాగగా, ఈ హత్యకు సంబంధించిన లింకులు విశాఖపట్నానికి ముడిపడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే విశాఖ చేరుకున్న ఒడిశా పోలీసులు.. కంచరపాలెంలో నివాసముంటున్న నిందితుడు బోలిశెట్టి సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు మరింత విచారణ జరుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us