ఆ ఊరి పేరే దీపావళి..ఇంతకీ ఎలా వచ్చిందంటే ?

|

Oct 26, 2019 | 12:32 PM

వ్యక్తుల పేర్లో.. ఆ ప్రాంతం ప్రత్యేకతకు ముడిపడో.. లేక ఊరు, పురం, కొండ, పాలెం ఇలాంటి ఊర్ల పేర్లను చూస్తుంటాం.. కానీ ఉత్తరాంధ్రలో ఓ ఊరు పేరు ఏకంగా ఒక పండగ పేరిట వుంది. వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. ఇది నిజం. ఇంతకీ ఆ ఊరు పేరేంటి ? ఎక్కడుందా ఊరు అనుకుంటున్నారా ? రీడ్ దిస్ స్టోరీ.. అవును.. ఆవూరి పేరు దీపావళి. శ్రీకాకుళం జిల్లాకేంద్రానికి సమీపంలో వున్న ఊరు అది. దీపావళి పండగ సమీపిస్తున్న […]

ఆ ఊరి పేరే దీపావళి..ఇంతకీ ఎలా వచ్చిందంటే ?
Follow us on

వ్యక్తుల పేర్లో.. ఆ ప్రాంతం ప్రత్యేకతకు ముడిపడో.. లేక ఊరు, పురం, కొండ, పాలెం ఇలాంటి ఊర్ల పేర్లను చూస్తుంటాం.. కానీ ఉత్తరాంధ్రలో ఓ ఊరు పేరు ఏకంగా ఒక పండగ పేరిట వుంది. వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. ఇది నిజం. ఇంతకీ ఆ ఊరు పేరేంటి ? ఎక్కడుందా ఊరు అనుకుంటున్నారా ? రీడ్ దిస్ స్టోరీ..

అవును.. ఆవూరి పేరు దీపావళి. శ్రీకాకుళం జిల్లాకేంద్రానికి సమీపంలో వున్న ఊరు అది. దీపావళి పండగ సమీపిస్తున్న తరుణంలో ఈ ఊరు మరోసారి వార్తలకెక్కింది. పండగ పేరుతో వెలిసిన ఈ ఊరి జనం.. దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం.

ఆ ఊరికి దీపావళి పేరు ఎలా వచ్చిందంటే ?

రాజుల కాలంలో చిక్కోలులో వుండి కళింగపట్నంలో పనులు ముగించుకుని  గుర్రంపై అటుగా వస్తున్న ఓ ముస్లిం రాజు తీవ్ర అస్వస్థతకు గురై ఈ గ్రామం సమీపంలోని ఓ పాడు పడిన గుడి దగ్గర పడిపోయాడంట. ఆ సమయంలో అక్కడే పనులు చేసుకుంటున్న గ్రామస్తులు ఆయనకు సేవలు చేసి, రక్షించారంట. అతనికి తిరిగి స్పృహ వచ్చిన రోజున దీపావళి పర్వదినం. లేచిన తర్వాత ఆ రాజు ఈ ఊరి పేరేంటని ప్రశ్నించడంతో గ్రామస్తులు తమ గ్రామానికి అసలు పేరే లేదని సమాధానమిచ్చారంట. దాంతో దీపావళి పర్వదినం పేరునే ఆ గ్రామానికి పెట్టినట్లు సమాచారం.

దీపావళి గ్రామంలో తమ గ్రామానికి పేరేలా వచ్చిందని ఎవరిని అడిగినా ఇదే కథ చెబుతారు. అయితే పూర్తిగా ఆరోగ్యవంతుడైన రాజు తిరిగి వెళుతూ.. అక్కడ పాడుపడి వున్న గుడిని పూర్తిగా పునరుద్దరించారని గ్రామస్తులు చెబుతారు. ఆ తర్వాత ఆ గ్రామం మీదుగా ప్రయాణించే వారంతా ఆ గుడి దగ్గర ఆగి మరీ పూజాధికాలు నిర్వహించి వెళతారని గ్రామస్తులు చెబుతున్నారు.

అక్కడ దీపావళి 5 రోజులు !

దేశమంతా దీపావళిని… నరక చతుర్ధశిగా ఒకరోజు.. దీపావళి అమావాస్య  పేరుతో రెండో రోజు.. ఇలా రెండు రోజుల పండుగను జరుపుకుంటే.. ఈ దీపావళి గ్రామస్తులు మాత్రం ఏకంగా 5 రోజుల పాటు దీపావళి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ ఊరి పేరేంటి అని ఎవరైనా అడిగినపుడు తాము దీపావళి అంటే అంతా ఆశ్చర్యంగా చూస్తారని గ్రామస్తులు చెబుతారు. అయినా.. తమకు తమ ఊరి పేరు ఓ అదృష్టంగా భావిస్తామని గ్రామస్తులు చెబుతారు. పండగ పేరుతో వుండడం వల్ల తమ ఊరిని తామంతా ప్రత్యేకంగా ఇష్టపడతామని గ్రామస్తులు తెలిపారు.