Car Fire Accident: పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి భారీగా ఎగిసిపడ్డ మంటలు..! రెప్పపాటులో..!

విశాఖపట్నం ఎన్ఏడి నుంచి గోపాలపట్నం మీదగా పెందుర్తికి ఓ కారు వెళుతోంది. గోపాలపట్నం జంక్షన్ కు వచ్చేసరికి.. కారులోంచి ఒక్కసారిగా మంటలు చెరేగాయి. తెరుకునేలోపే భారీ మంటలు కారంతా వ్యాపించాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికుల్లో మరింత ఆందోళన పెరిగింది.

Car Fire Accident: పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి భారీగా ఎగిసిపడ్డ మంటలు..! రెప్పపాటులో..!
Car Fire Accident
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 23, 2024 | 12:19 PM

విశాఖపట్నం ఎన్ఏడి నుంచి గోపాలపట్నం మీదగా పెందుర్తికి ఓ కారు వెళుతోంది. గోపాలపట్నం జంక్షన్ కు వచ్చేసరికి.. కారులోంచి ఒక్కసారిగా మంటలు చెరేగాయి. తెరుకునేలోపే భారీ మంటలు కారంతా వ్యాపించాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికుల్లో మరింత ఆందోళన పెరిగింది. పెట్రోల్ బంకులో ఉన్న ఫైర్ ఎగ్జాస్టర్ తెచ్చి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నింంచారు. ఆ ప్రయత్నం ఫలించలేదు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఈలోగా కేవలం పదిహేను నిమిషాల్లోనే కారు పూర్తిగా కాలిపోయింది. దీంతో అటుగా వెళుతున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

గోపాలపట్నం బంకు మధ్య రోడ్డులో ఏపీ 31 టీవీ 6893 అనే నెంబర్ గల కారు అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయింది. ముందుగా ప్రమాదాన్ని పసిగట్టిన కారు డ్రైవర్ గోపాలపట్నం పెట్రోల్ బంకు దగ్గర మధ్యలో ఆపి దిగిపోయారు. ఈ ప్రమాదంలో కారు నష్టం తప్ప ప్రాణ నష్టం కానీ ఎటువంటిదిది జరగలేదు. కారును మెకానిక్ షాపు దగ్గర నుంచి ఇంటికి తీసుకెళుతున్న క్రమంలో మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టుగా డ్రైవర్ సాయికుమార్ పోలీసులకు చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని క్రైైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?