అలర్ట్‌: విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

విజయవాడలో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. రేపు ఉదయం 4 గంటల నుంచి గుంటూరు మీదుగా విజయవాడలోకి లారీలు, భారీ వాహనాలను అనుమతించమని ఆయన అన్నారు.  108, 104 నూతన వాహనాల ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో చెన్నై నుంచి విశాఖపట్నంకు వెళ్లే వాహనాలు ఒంగోలు జిల్లా త్రోవగుంట ద్వారా.. విశాఖపట్టణం నుంచి చెన్నై వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ […]

అలర్ట్‌: విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 10:12 PM

విజయవాడలో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. రేపు ఉదయం 4 గంటల నుంచి గుంటూరు మీదుగా విజయవాడలోకి లారీలు, భారీ వాహనాలను అనుమతించమని ఆయన అన్నారు.  108, 104 నూతన వాహనాల ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో చెన్నై నుంచి విశాఖపట్నంకు వెళ్లే వాహనాలు ఒంగోలు జిల్లా త్రోవగుంట ద్వారా.. విశాఖపట్టణం నుంచి చెన్నై వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ ద్వారా మళ్లింపులు చేస్తామని ఆయన వెల్లడించారు.

విజయవాడ నగరంలోనూ దారి మళ్లింపులు ఉంటాయని శ్రీనివాసులు అన్నారు. రాత్రి 12 గంటల తరువాత బెంజ్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు రెండు వైపులా ఏ వాహనానికి అనుమతి లేదని ఆయన తెలిపారు. ఇక గుంటూరు నుంచి ఏలూరు వెళ్లే వాహనాలు వారది మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి విజయవాడలోకి అనుమతిని ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే ఏలూరు నుంచి గుంటూరు వెళ్లే వాహనలు గురునానాక్ కాలనీ నుంచి మళ్లిస్తామని వివరించారు. వీటితో పాటు మచిలీపట్నం నుంచి గుంటూరు వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ సర్కిల్.. మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే వాహనాలు ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు నుంచి మళ్లిస్తామని తెలిపారు. ఇక ఏలూరు నుంచి విజయవాడ వచ్చే బస్సులు రామవరప్పాడు రింగ్ నుంచి ఏలూరు రోడ్డు వైపు.. మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ వచ్చే బస్సులు తాడిగడప నుంచి మళ్లింపు ఉంటాయని అన్నారు.

ఇదిలా ఉంటే ప్రజాపతినిధులు, ముఖ్య అతిధులు..జాతీయ రహదారి , పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డు , రూట్ నెంబర్-5, ఏలూరు రోడ్డు, మచిలీపట్నం రోడ్డు మీదుగా బెంజ్ సర్కిల్‌కి బెంజ్ సర్కిల్‌కి చేరుకోవాలని శ్రీనివాసులు సూచించారు. ట్రాఫిక్ వాహన మళ్లింపుకు ప్రజలు సహకరించాలని శ్రీనివాసులు ఈ సందర్భంగా విఙ్ఞప్తి చేశారు.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..