కొత్త జాతీయ రహదారి: హైదరాబాద్- తిరుపతి మధ్య తగ్గనున్న 80కి.మీ దూరం

తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతిని ఇచ్చింది.

కొత్త జాతీయ రహదారి: హైదరాబాద్- తిరుపతి మధ్య తగ్గనున్న 80కి.మీ దూరం
Follow us

| Edited By:

Updated on: Oct 26, 2020 | 4:17 PM

Kalvakurthy to Karivena: తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతిని ఇచ్చింది. ఈ నూతన జాతీయ రహదారితో హైదరాబాద్ నుంచి తిరుపతికి 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ ఈ జాతీయ రహదారి నిర్మాణం ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం కూడా ఏర్పాటు కానుంది.

భారతమాల పథకం కింద ఈ జాతీయ రహదారికి కేంద్ర రవాణా శాఖ అనుమతిని ఇచ్చింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. తెలంగాణలో 86 కిలోమీటర్లు, ఏపీలో 26 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. ఈ నేపథ్యంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, నాగర్ కర్నూల్‌ జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, నాగర్ కర్నూల్‌ అసెంబ్లీ ఇంఛార్జి నెడునూరి దిలీపాచారి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు.

Read More:

నాచారం చోరీ కేసు.. నేపాలీ ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

సేతుపతి కుమార్తెకు అత్యాచార బెదిరింపు: క్షమాపణలు కోరిన నిందితుడు