Tirumala: తిరుమలలో ఏడాదికి ఒక్కసారి అభిషేకం..విగ్రహాల అరుగుదలకు కీలక నిర్ణయం.. ధర్మకర్త మండలి ఆమోదముద్ర

Tirumala: తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మేరకు అభిషేకాలను తగ్గించాలని నిర్ణయించింది. ప్రతి సోమవారం నిర్వహించే

Tirumala: తిరుమలలో ఏడాదికి ఒక్కసారి అభిషేకం..విగ్రహాల అరుగుదలకు కీలక నిర్ణయం.. ధర్మకర్త మండలి ఆమోదముద్ర
Tirumala
Follow us

|

Updated on: Mar 19, 2021 | 9:48 AM

Tirumala: తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మేరకు అభిషేకాలను తగ్గించాలని నిర్ణయించింది. ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజతో పాటు బుధవారం చేసే సహస్ర కలశాభిషేకం, నిత్యం నిర్వహించే ఆర్జిత వసంతోత్సవ సేవలను ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నారు. తద్వారా మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాల అరుగుదలను నిరోధించవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలిలో తీర్మానించారు. శ్రీవారి ఉత్సవమూర్తులకు వివిధ సందర్భాల్లో ఏడాదిలో 450 సార్లు అభిషేకం నిర్వహిస్తుంటారు. ఇందులో కొన్ని పంగలు, ఉత్సవాల సమయంలో ఏకాంతంగా చేస్తుంటారు. ఇలా పెద్ద ఎత్తున అభిషేకాలు చేయడం వల్ల విగ్రహాలు అగిరిపోతున్నట్లు అర్చకులు గుర్తించారు. విగ్రహాల ముఖాలు మారిపోయి సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. అభిషేకాల్లో రోజూఐ చేసే వసంతోత్సవంతో పాటు వారంలో ఒక రోజు నిర్వహించే విశేష పూజ, సహస్ర కలశాభిషేకాలు ఉన్నాయి. ఈ సేవలకు తిరుమల శ్రీవారి పూజా విధానంలో ఎలాంటి చారిత్రక ప్రాధాన్యం లేదని అగమ సలహా మండలి సభ్యులతో పాటు ప్రధాన అర్చకులు అభిప్రాయపడుతున్నారు. గతంలోసహస్ర కలశాభిషేకం ఏడాదిలో ఒక్కసారే నిర్వహించేవారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆర్థిత వసంతోత్సవం ఏడాదిలో మూడుసార్లు నిర్వహించేవారంటున్నారు. ముందుగా అర్జిత వసంతోత్సవాన్ని రంగనాయక మండపంలో చేసేవారు. 2006 నుంచి ఈ సేవను రాంభగీచా అతిథిగృహం వద్ద ఉన్న వైభవోత్సవ మండపంలో రోజూ నిర్వహిస్తున్నారు.

అర్చకుల ప్రతిపాదనలు

కాగా, ఉత్సవమూర్తులను పరిరక్షించేందుకు గానూ టీటీడీ ప్రధాన అర్చకులు, ఆగమ సలహామండలి సభ్యులు, పెద్ద జీయంగారు తదితరులు అధికారులకు కొన్ని ప్రతిపాదనలు చేశారు. 2019 అక్టోబర్‌లో ప్రధాన అర్చకులతో పాటు రెసిడెంట్‌ ఆగమ సలహాదారు సంయుక్తంగా టీటీడీ ఉన్నతాధికారులు ఒక వినతిపత్రం సైతం సమర్పించారు. వసంతోత్సవం, విశేష పూజా, సహస్ర కలశాభిషేక సేవల వల్ల విగ్రహాల ముఖాలు మారిపోతున్నాయని, ఆరాధన పీఠం దెబ్బతింటోందని నివేదించారు. ఈ కారణంగానే అభిషేకాలు తగ్గించాలని వారు కోరారు. అయితే ఈ ప్రతిపాదనపై 2019 నవంబర్‌లో ఆగమ సలహా కమిటీ సభ్యులు చర్చించారు. ఇందులో విశేష పూజను ఏడాదికి ఒకసారి నిర్వహించాలని సూచించారు. సహస్ర కలశాభిషేకం, ఆర్జిత వసంతోత్సవాలను సాలకట్ల ఉత్సవంగా ఏడాదికి ఒక్కసారే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలపై ఇటీవల ధర్మకర్తల మండలిలో చర్చించి సూచనలను ఆమోదముద్ర వేశారు. దీంతో ఇక నుంచి సేవలకు కేవలం ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి:

Financial Dates: మార్చి 31వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేసుకోండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.. అవేంటంటే..

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

Latest Articles