Twins Day: తిరుపతిలో ఖషి సీన్ రిపీట్.. ఒకే వేదికపై 100 మంది కవలలు!

Edited By:

Updated on: Feb 23, 2026 | 4:44 PM

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్నది పెద్దల మాట. అది నిజమో కాదో తెలియదు కానీ తిరుపతిలో మాత్రం ట్వీన్స్ డే ఏకంగా 100 మంది కవలలను ఒక్కచోట చేర్చింది. కవలల ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో అపురూప వేడుక జరిగింది. ఔరా అనిపించేలా ఒకే రూపం కలిగిన కవలలు అందరినీ ఆకట్టుకున్నారు.

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్నది పెద్దల మాట. అది నిజమో కాదో తెలియదు కానీ తిరుపతిలో మాత్రం ట్వీన్స్ డే ఏకంగా 100 మంది కవలలను ఒక్కచోట చేర్చింది. కవలల ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో అపురూప వేడుక జరిగింది. ఔరా అనిపించేలా ఒకే రూపం కలిగిన కవలలు అందరినీ ఆకట్టుకున్నారు. ట్విన్స్ డే సందర్భంగా తిరుపతికి చెందిన హేమవతి హేమలత ఇద్దరు కవలలు 100 మంది కవలలను ఒక్కచోట చేర్చారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న హేమలత హేమావతి ఇద్దరూ కొన్ని ఏళ్లు గా ఏపీ తెలంగాణ ప్రాంతాల్లోని కవలలను ఒక వేదిక పైకి తీసుకొస్తున్నారు. కవలలు రుచులు అభిరుచులు పంచుకుంటూ సందడి చేయడంతో కన్నుల వింపుగా కార్యక్రమం జరిగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us